టాలీవుడ్ లో షూటింగ్ సందడి..!
వెంకటేష్ తో త్రివిక్రం చేస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా షూటింగ్ రీసెంట్ గా మొదలైంది. బాలయ్య బాబు గోపీచంద్ మలినేని కాంబినేషన్ సినిమా కూడా రీసెంట్ గానే సెట్స్ మీదకు వెళ్లింది.;
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు సినిమాల ఇంపాక్ట్ తెలిసిందే. ఇక్కడ మన స్టార్స్ చేస్తున్న సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. అఫ్కోర్స్ కొన్ని సినిమాలు అంచనాలను అందుకోలేక చతికిల పడ్డవి ఉన్నాయి. ఏది ఏమైనా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు స్టార్ హీరోలు, క్రియేటివ్ డైరెక్టర్స్, అభిరుచి గల నిర్మాతలు ఇలా అందరు తమ ఎఫర్ట్స్ పెట్టేస్తున్నారు.
సంక్రాంతి సినిమాల రిలీజ్..
ఇక నెక్స్ట్ రిలీజ్ ల కోసం టాలీవుడ్ లో ఇప్పుడు అందరు కూడా తమ సినిమాల షూటింగ్స్ తో బిజీ బిజీగా ఉన్నారు. సంక్రాంతి రిలీజ్ సినిమాల షూటింగ్ దాదాపు పూర్తైనట్టే అనిపిస్తుంది. ఇక ఫిబ్రవరి మార్చి సినిమాలతో పాటు నెక్స్ట్ బిగ్ రిలీజ్ సినిమాల షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి. నాని ది ప్యారడైజ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
ఎన్ టీ ఆర్, ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఐతే ఈ సినిమా 2027 రిలీజ్ షెడ్యూల్ చేశారు. మరోపక్క అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. ఆ సినిమా షూటింగ్ కూడా దూకుడుగా కొనసాగుతుంది. రాం చరణ్ పెద్ది షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. రవితేజ భర్త మహాశయులకు దాదాపు పూర్తి కాగా సూర్య 46 సినిమా షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ పూర్తి చేశారు.
వెంకటేష్ తో త్రివిక్రం చేస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా షూటింగ్ రీసెంట్ గా మొదలైంది. బాలయ్య బాబు గోపీచంద్ మలినేని కాంబినేషన్ సినిమా కూడా రీసెంట్ గానే సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సినిమాల షూటింగ్స్ తో టాలీవుడ్ లో టెక్నిషియన్స్ అంతా బిజీ బిజీగా ఉన్నారు.
షూటింగ్ లతో స్టార్స్ బిజీగా ఉంటే..
ఒక స్టార్ సినిమా కోసం వందల కొద్దీ పనిచేస్తారు. అందుకే ఇండస్ట్రీలో సినిమాలు సక్సెస్ అయితే స్టార్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, టెక్నిషియన్స్ తో పాటు ఆ సినిమాకు పనిచేసే అందరు సక్సెస్ అయినట్టే అవుతుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ సత్తా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ లో చాటి చెప్పేందుకు మేకర్స్ కొత్త కథలతో కొత్త అటెంప్ట్ చేస్తున్నారు.
షూటింగ్ లతో స్టార్స్ బిజీగా ఉంటే రాబోయే సినిమాల మీద ఫ్యాన్స్ తమ అంచనాలను కూడా పెంచేసుకుంటున్నారు. ఆల్రెడీ 2026 లో సినిమాల సందడి గురించి రిలీజ్ షెడ్యూల్ గురించి తెలిసిందే. మరి నెక్స్ట్ ఇయర్ బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ సినిమాల హంగామా ఎలా ఉంటుందో చూడాలి. యువ హీరో దగ్గర నుంచి స్టార్ హీరో వరకు తమ ఎఫర్ట్ తో అదరగొట్టేందుకు వస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా సినిమా కోసం తమ పూర్తి స్థాయి ఇన్వాల్వ్ మెంట్ చూపిస్తున్నారు. ఆ రేంజ్ కమిట్మెంట్ ఉంటుంది కాబట్టే సినిమాల ఫలితాలు కూడా అదే రేంజ్ లో ఉంటున్నాయి.