2025 బ్లాక్ బస్టర్.. సూపర్ హిట్ సినిమాల లెక్క ఇదే..!

టాలీవుడ్ లో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాల లెక్క తెలుసుకోవాలని ఆడియన్స్ కు ఉంటుంది.;

Update: 2025-09-20 09:30 GMT

టాలీవుడ్ లో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాల లెక్క తెలుసుకోవాలని ఆడియన్స్ కు ఉంటుంది. 2025 సెప్టెంబర్ వరకు రిలీజైన సినిమాల్లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్.. ఏది సూపర్ హిట్.. ఏది హిట్ సినిమాగా నిలిచాయో చూసేద్దాం.. ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం అంటూ సంక్రాంతికి వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకున్నారు మన విక్టరీ వెంకటేష్. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల ఖాతా తెరచింది. ఈ మూవీ వెంకటేష్ ఖాతాలో 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా చరిత్ర సృష్టించింది.

నాగ చైతన్య కెరీర్ లో 100 కోట్ల సినిమా..

ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య తండేల్ సినిమా సూపర్ హిట్ మూవీగా నిలిచింది. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరీఓయిన్ గా నటించింది. నాగ చైతన్య కెరీర్ లో మొదటి 100 కోట్ల సినిమాగా ఇది నిలిచింది. ఇక నాని నిర్మాణంలో వచ్చిన కోర్ట్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. రాం జగదీష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవి నటించారు. ప్రియదర్శి ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు.

ఇక ఈ ఇయర్ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ సీక్వెల్ గానే వచ్చినా వేరే కథతో తెరకెక్కించి నవ్వులు పండించారు. ఫలితంగా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక అదే వరుసలో నాని హిట్ థర్డ్ కేస్ కూడా హిట్ అయ్యింది. శైలేష్ కొలను ఈ సినిమాను క్రైం థ్రిల్లర్ గానే కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తీసి హిట్ అందుకున్నారు. శ్రీ విష్ణు సింగిల్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కూడా ఆడియన్స్ కి సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది.

కుబేర సినిమా హిట్..

సమంత నిర్మించిన శుభం సినిమా కూడా సక్సెస్ అయ్యింది. ట్రాలాలా బ్యానర్ లో సమంత మేడిన్ మూవీగా శుభం ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాను ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేశాడు. ధనుష్ శేఖర్ కమ్ముల కాంబో సినిమా కుబేర సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో కింగ్ నాగార్జున దీపక్ రోల్ లో సర్ ప్రైజ్ చేశారు.

ఇక రీసెంట్ గా రిలీజై బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది లిటిల్ హార్ట్స్. ఈ సినిమా యువ టీం అంతా కలిసి రెండున్నర కోట్లతో సినిమా తీసి 50 కోట్ల దాకా కలెక్షన్స్ రాబట్టారు. ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ కా బాప్ అంటే ఇప్పటివరకు లిటిల్ హార్ట్స్ సినిమా అనే చెప్పొచ్చు.

మిరాయ్, కిష్కింధపురి సినిమాలు..

ఇక లాస్ట్ వీక్ రిలీజైన మిరాయ్, కిష్కింధపురి సినిమాలు కూడా సక్సెస్ ఫుల్ గానే రన్ అవుతున్నాయి. రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోగా ఏది బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. ఏది జస్ట్ హిట్ గా ఉంటుంది అన్నది ఫైనల్ రన్ లో తెలుస్తుంది.

ఇక ఈ ఇయర్ డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు బాక్సాఫీస్ పై సత్తా చాటాయి. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఛావా సినిమా తెలుగులో మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇక రిటర్న్ ఆఫ్ డ్రాగన్ సినిమా కూడా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయ్యింది.

మహావతార్ నరసింహ సినిమా..

హోంబలే బ్యానర్ నుంచి వచ్చిన మహావతార్ నరసింహ సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 30 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 300 కోట్ల పైన కలెక్ట్ చేసి డబ్బింగ్ సినిమాల్లో హ్యూజ్ హిట్ అందుకుంది. ఇదే వరుసలో మలయాళంలో తెరకెక్కిన లోక సినిమా తెలుగులో కొత్త లోకగా వచ్చింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇవే కాదు నెక్స్ట్ రాబోతున్న ఓజీ సినిమా కాంతారా ప్రీక్వెల్ తో పాటు అఖండ 2 ఇలా రిలీజ్ కాబోయే సినిమాల్లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. వీటిలో ఏది సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నది చూడాలి.

Tags:    

Similar News