అల్లు - అట్లీ సినిమాలో టైగర్.. లాభమే కానీ..
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న ఆ భారీ ప్రాజెక్ట్ (AA23) గురించి రోజుకో క్రేజీ అప్డేట్ బయటకు వస్తోంది.;
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న ఆ భారీ ప్రాజెక్ట్ (AA23) గురించి రోజుకో క్రేజీ అప్డేట్ బయటకు వస్తోంది. ఇప్పటికే దీపికా పదుకొణె ఫిక్స్ కాగా, మరోవైపు జాన్వీ కపూర్, మృణాల్ వంటి స్టార్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ కూడా ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ లో భాగం కాబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, ఇండియన్ స్క్రీన్ మీద ఇద్దరు బిగ్గెస్ట్ డ్యాన్స్ అండ్ యాక్షన్ కింగ్స్ ని ఒకే ఫ్రేమ్ లో చూడటం ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే విషయమే.
అల్లు అర్జున్ డ్యాన్స్ గ్రేస్ గురించి మనందరికీ తెలిసిందే, అలాగే టైగర్ ష్రాఫ్ చేసే యాక్షన్ స్టంట్స్ కి ఫిదా అవ్వని వారుండరు. వీళ్లిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయం. కానీ ఇక్కడే ఒక చిన్న డౌట్ మొదలవుతోంది. అట్లీ తన సినిమాను 800 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న నేపథ్యంలో, మార్కెట్ లెక్కల ప్రకారం బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ సినిమాలో వరుసగా బాలీవుడ్ నటులను దింపుతుండటం చూస్తుంటే, ఇది అసలు సౌత్ సినిమానా లేక బాలీవుడ్ సినిమానా అనే సందేహం కలుగుతోంది. టాలీవుడ్, మలయాళం, కన్నడ మార్కెట్లలో అల్లు అర్జున్ బ్రాండ్ తో ఎలాగూ డోకా లేదు. ఇక తమిళ్ లో అట్లీకి ఉన్న ఫాలోయింగ్ తో అక్కడ కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అయితే మొత్తం ఉత్తరాది నటులనే నింపేస్తే, తమిళ ఆడియన్స్ ఈ సినిమాను ఎలా ఓన్ చేసుకుంటారు అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
తమిళ ప్రేక్షకులకు సాధారణంగా తమ భాష, సంస్కృతి, స్థానిక నటులపై అభిమానం ఎక్కువగా ఉంటుంది. సినిమా అంతా వేరే భాషా నటులతో నిండిపోతే, అక్కడ ఇంట్రెస్ట్ తగ్గే ఛాన్స్ ఉందనేది కొందరి అభిప్రాయం. కేవలం హిందీ మార్కెట్ ని టార్గెట్ చేసి సౌత్ నేటివిటీని మిస్ చేస్తే అట్లీ కి ఉన్న హోమ్ గ్రౌండ్ లో రిస్క్ అయ్యే అవకాశం ఉంది.
అయితే అట్లీ విజన్ ఎప్పుడూ ఇంటర్నేషనల్ లెవెల్ లోనే ఉంటుంది. ఒకవేళ టైగర్ ష్రాఫ్ ఈ ప్రాజెక్ట్ లోకి వస్తే, అది కేవలం గ్లామర్ కోసమే కాకుండా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ల కోసం అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇద్దరు అదిరిపోయే డ్యాన్సర్ల మధ్య సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఫ్యాన్స్ అప్పుడే ఫిక్స్ అయిపోయారు.
ఏదేమైనా అల్లు అట్లీ సినిమా ఇంటర్నేషనల్ స్కేల్ లో ప్లాన్ అవుతున్నా, లోకల్ ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తారనేది చూడాలి. టైగర్ ష్రాఫ్ ఎంట్రీ పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఈ బజ్ వింటేనే సినిమా రేంజ్ ఏంటో అర్థమైపోతోంది. బాలీవుడ్ మార్కెట్ ని కొల్లగొట్టే క్రమంలో అట్లీ తీసుకోబోయే ఈ ‘టైగర్’ డెసిషన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.