హాలీవుడ్ మూవీకి టైగర్ ష్రాఫ్ గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలివే

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిమితులు పూర్తిగా చెరిగిపోయాయి. టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు చాలా సినిమాలు ఇక్కడివి అక్కడ.. అక్కడివి ఇక్కడ విడుదలవుతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి.;

Update: 2025-10-02 10:17 GMT

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిమితులు పూర్తిగా చెరిగిపోయాయి. టాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్ వరకు చాలా సినిమాలు ఇక్కడివి అక్కడ.. అక్కడివి ఇక్కడ విడుదలవుతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. తెలుగు, తమిళ్ , హిందీ అని తేడా లేకుండా ఒక భాషలో వచ్చిన సినిమా ప్రతి భాషలో కూడా విడుదలవుతూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ పక్కన పెడితే.. చాలా మంది హాలీవుడ్ సినిమాలలో నటించడానికి కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

హాలీవుడ్ లోకి టైగర్ ష్రాఫ్..

ఇప్పటికే ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి తారలు హాలీవుడ్ లో కూడా సినిమాలు చేసి సత్తా చాటుతుంటే.. తామేమి తక్కువ కాదంటూ బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా హాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే హిందీ పరిశ్రమలో ప్రముఖ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న టైగర్ ష్రాఫ్ తాజాగా హాలీవుడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఈ హాలీవుడ్ చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారు? దర్శకుడు ఎవరు? నిర్మాతలు ఎవరు? ఏ జానర్ లో సినిమా రాబోతోంది? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

ముగ్గురు యాక్షన్ స్టార్లతో..

అసలు విషయంలోకి వెళ్తే.. అమెజాన్ ఎంజీఎం ఒక గ్లోబల్ యాక్షన్ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఇందులో హాలీవుడ్ దిగ్గజం సిల్వెస్టర్ స్టాలోన్ తో పాటూ యాక్షన్ హీరో టోనీజా లతో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముగ్గురు యాక్షన్ స్టార్ లను మొదటిసారి కలిపి తెరపై చూపించే ప్రయత్నం చేయబోతోంది అమెజాన్ ఎంజీఎం. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా నిర్మించడానికి చర్చలు జరుపుతున్నారట. ఈ ప్రాజెక్టును బహుభాషా చిత్రంగా రూపొందించాలని కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

పాన్ వరల్డ్ యాక్షన్ డ్రామాగా..

ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అమెజాన్ ఎంజీఎం ఇప్పటికే ఈ ముగ్గురు నటులతో చర్చలు జరపగా.. ముగ్గురు కూడా ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి దర్శకుడుగా భారతీయుడు పేరు వినిపిస్తోంది. కానీ ఆ వివరాలు ఇంకా గోప్యంగా ఉంచడం గమనార్హం. విలక్షణమైన పాన్ వరల్డ్ యాక్షన్ సినిమాలో తమ అభిమాన నటుడు సిల్వెస్టర్ తో జతకట్టడానికి టైగర్ ష్రాఫ్ కూడా ఉత్సాహం కనబరుస్తున్నారు. ఈ ప్రాజెక్టు హాలీవుడ్ సిగ్నేచర్ గ్రాండ్ స్కేల్ ను ఆసియా సినిమా డైనమిక్ ఇంటెన్సిటీ లక్షణంతో కలిపి ఒక విస్తారమైన అంతర్జాతీయ చిత్రంగా రూపొందించబడుతోందని నివేదికలు చెబుతున్నాయి.

హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన ఇండియన్ మూవీ..

సిల్వెస్టర్ స్టాలోన్ కి బాలీవుడ్ తో అనుబంధం ఉంది. 2009లో అక్షయ్ కుమార్ , కరీనాకపూర్ జంటగా వచ్చిన కంభక్త్ ఇష్క్ అనే సినిమాలో చిన్న పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ సినిమాలోకి భారతీయ దర్శకుడు చేరితే మాత్రం ఇది భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సిల్వెస్టర్ స్టాలోన్ మొదటి పూర్తి ఫీచర్ ఫిలిం అవుతుంది అని చెప్పవచ్చు.

Tags:    

Similar News