కూలీ - వార్ 2: ఏపీలో టిక్కెట్ రేట్లు ఎంత పెరగొచ్చు?
రజనీకాంత్- లోకేశ్ కనగరాజ్ కూలీ.. ఎన్టీఆర్- హృతిక్ రోషన్ వార్ 2 సినిమాలు ఒకే రోజు విడుదల కానుండడం ఇరు వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది.;
ఆగస్టు 14 ఇండియన్ బాక్సాఫీస్ కు పెద్ద రోజు. రజనీకాంత్- లోకేశ్ కనగరాజ్ కూలీ.. ఎన్టీఆర్- హృతిక్ రోషన్ వార్ 2 సినిమాలు ఒకే రోజు విడుదల కానుండడం ఇరు వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమాల క్లాష్ ఎలా ఉండనుందో ప్రేక్షకులు మరో నాలుగు రోజుల్లో అనభూతి చెందగలరు. అయితే ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీల్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఇక ఈరోజో, రేపో తెలుగు రాష్ట్రాల్లోనూ బుకింగ్స్ మొదలు కానున్నాయి.
అయితే గత కొన్నేళ్లుగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. టికెట్ ధరలు అమాంతం పెంచేస్తున్నారు మేకర్స్. ప్రభుత్వాలు కూడా అలా అనుమతులు ఇచ్చేస్తున్నాయి. అయితే ఇప్పుడు రిలీజ్ కానున్న కూలీ, వార్ 2 ఈ రెండు కూడా స్ట్రైట్ తెలుగు సినిమాలు కావు. కూలీ తమిళ్ నుంచి డబ్బింగ్ కాగా, వార్ 2 హిందీ నుంచి వస్తోంది. కానీ, ఇక్కడ అటు రజనీకాంత్ కు మార్కెట్ ఉండడం, వార్ 2 లో కీలక పాత్ర పోషించిన ఎన్టీఆర్ స్వయంహా తెలుగు స్టార్ హీరో కావడంతో ఓపెనింగ్స్ భారీగానే ఉంటాయని ట్రేడ్ వర్గాలు ఆంచనాలు వేస్తున్నాయి.
ఇక ఇప్పటికే ఓవర్సీస్ తోపాటు, దేశంలోనూ పలు రాష్ట్రాల్లో బుకింగ్స్ ప్రారంభం కాగా.. తెలుగులో సేల్ రేపు షురూ అవ్వనుంది. ఈ క్రమంలోనే టికెట్ ధరలపై అభిమానుల దృష్టి పడింది. ఇలా డబ్బింగ్ సినిమాలకు కూడా రేటు పెంచుతారా? లేదా ఎప్పటి రేటే కంటిన్యూ చేస్తారా అని అనుకుంటున్నారు. కానీ తాజాగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం... ఈ రెండు సినిమాలకు కూడా ఒక్కో టికెట్ పై రూ.50 వరకు అదనంగా పెరగవచ్చని అంటున్నారు.
దీనిపై మరో కొన్ని గంటల్లోనే స్పష్టత వస్తుంది. ఈ రెండు సినిమాల మేకర్స్ కూడా వీటిని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇరు సినిమాలకు ఓవర్సీస్ లోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది. కానీ, రెండింటినీ పోలిస్తే మాత్రం వార్ 2 కంటే బుకింగ్స్ లో కూలీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇంకా నాలుగు రోజులు టైమ్ ఉండడంతో రెండు సినిమాల అడ్వాన్స్ టికెట్ సేల్స్ పెరగడం పక్కా!
కాగా, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం కూలీ సినిమాను గ్యాంగ్ స్టర్, గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరెక్కించారు. ఇందులో నాగార్జున అక్కినేని, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్ నటించగా సన్ పిక్చర్స్ నిర్మించింది. మరోవైపు వార్ 2 సినిమాను స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ జానర్ గా ఆయన్ ముఖర్జీ తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్- హృతిక్, కియారా అద్వాణీ నటించారు. ఈ సినిమా యష్ రాజ్ ఫిల్మ్ బ్యాటర్ పై రూపొందింది.