ది ప్యారడైజ్.. శ్రీకాంత్ ఓదెల ర్యాంపేజ్..!
ఐతే లేటెస్ట్ గా ది ప్యారడైజ్ సినిమా నుంచి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల BTS రిలీజైంది. ఈ బీ టీ ఎస్ చూస్తే శ్రీకాంత్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడు అన్నది అర్థమవుతుంది.;
నానితో దసరా లాంటి సెన్సేషనల్ మూవీ తీశాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన అతను నానిని ఒప్పించి దసరా లాంటి సినిమా తీసి సూపర్ హిట్ కొట్టడమే సక్సెస్ అయినట్టు లెక్క అలాంటి డైరెక్టర్ నుంచి రెండో సినిమా అనగానే ఆడియన్స్ లో కూడా భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ క్రమంలో నాని తోనే ది ప్యారడైజ్ అంటూ మరో సినిమా చేస్తున్నాడు శ్రీకాంత్ ఓదెల. నాని శ్రీకాంత్ ఓదెల మరో అద్భుతాన్ని సృష్టించేలా ది ప్యారడైజ్ రాబోతుందని తెలుస్తుంది.
ది ప్యారడైజ్ శ్రీకాంత్ ఓదెల BTS..
ఈ సినిమాలో నాని జడల్ పాత్రలో డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నాడు. ఆల్రెడీ రిలీజైన ప్రమోషనల్ వీడియో అయితే గూస్ బంప్స్ ఇచ్చింది. ఐతే లేటెస్ట్ గా ది ప్యారడైజ్ సినిమా నుంచి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల BTS రిలీజైంది. ఈ బీ టీ ఎస్ చూస్తే శ్రీకాంత్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడు అన్నది అర్థమవుతుంది.
టాలెంట్ అందరికీ ఉంటుంది కానీ ఆ ప్రతిభని అవకాశం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకుంటేనే అది అందరికీ తెలుస్తుంది. దసరా తో దమ్ము చూపించిన శ్రీకాంత్ ఓదెల ఈసారి ది ప్యారడైజ్ తో మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. ది ప్యారడైజ్ డైరెక్టర్ బి.టి.ఎస్ చూస్తేనే సినిమా నిజంగానే నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంది.
మార్చి 26న నాని ది ప్యారడైజ్..
నాని జడల్ రోల్ లో వీర లెవెల్ మాస్ చూపించబోతున్నారు. ముఖ్యంగా ఈ BTS కి అనిరుద్ రవిచంద్రన్ ఇచ్చిన మ్యూజిక్ ఐతే మాటల్లేవు అనేలా చేసింది. సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ గా నటిస్తున్నారు. నాని శ్రీకాంత్ ఓదెల కాంబో మరోసారి సంథింగ్ స్పెషల్ అనిపించేలా రాబోతుంది. ది ప్యారడైజ్ సినిమాను 2026 మార్చి 26న రిలీజ్ లాక్ చేశారు.
నేడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి BTS వీడియో రిలీజ్ చేశారు. సినిమా కోసం శ్రీకాంత్ ఎంత కష్టపడుతున్నాడు అన్నది చూపిస్తూ రిలీజైన ఈ వీడియో న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. ఈసారి దసరా కాదు దాన్ని మించి హింట్ కొట్టేందుకు నాని రెడీ అవుతున్నాడని చెప్పొచ్చు.
నాని స్టోరీ సెలక్షన్ కి తిరుగు ఉండదనిపించేలా ఈమధ్య వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్తున్నాడు. ఐతే దసరా తో తన ఇమేజ్ ని పూర్తిగా మార్చేసుకున్న నాని ఆ సినిమా డైరెక్టర్ తోనే మరో క్రేజీ అటెంప్ట్ గా ది ప్యారడైజ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ స్టేట్మెంట్ టీజర్ తోనే అదరగొట్టారు. సినిమా కచ్చితంగా మరో క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని ఆడియన్స్ కూడా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజైన శ్రీకాంత్ ఓదెల బీ టీ ఎస్ వీడియో కూడా వావ్ అనిపించేలా చేసింది.