నాని 'ది ప్యారడైజ్'.. అప్పుడే 18 కోట్ల డీల్
ఈ సినిమా ఇప్పటి వరకు రెగ్యులర్ షూట్ ప్రారంభం కాకముందే ఇంత భారీ హైప్, రూ.18 కోట్ల ఆడియో రైట్స్ డీల్ సాధించడంతో సినిమా పట్ల ఆసక్తిని చూపిస్తోంది.;
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా మార్కెట్ లో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. ‘దసరా’ సినిమాతో సక్సెస్ అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో నాని మరోసారి చేతులు కలిపాడు. సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు, నాని కెరీర్‌లో అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నాని రోల్ కూడా నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండనుంది. విడుదలైన గ్లింప్స్‌లో నాని వైలెంట్, హై ఎనర్జీ యాక్షన్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
‘ది ప్యారడైజ్’ 1980ల కాలం నేపథ్యంలో సాగే సినిమా అని టాక్, సమాజంలో అణగారిన వర్గాల పోరాటాన్ని చూపిస్తుందని తెలుస్తోంది. గ్లింప్స్‌లో నాని టాటూతో , రస్టిక్ లుక్‌లో కనిపించి అభిమానులను ఆకర్షించాడు. “లం…. కొడుకు” అనే టాటూ సంచలనం రేపింది. ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేసింది.
తాజాగా ‘ది ప్యారడైజ్’ సినిమా ఆడియో రైట్స్ సంచలన రికార్డు సృష్టించాయి. ప్రముఖ మీడియా సంస్థ సరిగమ, అన్ని భాషల ఆడియో రైట్స్‌ను ఏకంగా రూ.18 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నాని సినిమాల్లో ఇది ఇప్పటివరకు అత్యధిక ఆడియో రైట్స్ డీల్‌గా నిలిచింది. ఈ భారీ డీల్ నాని స్టార్‌డమ్, గ్లింప్స్ సృష్టించిన హైప్, మాత్రమే కాదు రాక్‌స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తూ ఉండడంతో కాంబినేషన్ కు మంచి బజ్ ఏర్పడింది.
నాని, అనిరుద్ కాంబినేషన్ అంటే ఆడియన్స్‌లో భారీ అంచనాలు ఉంటాయి. వీరి మునుపటి సినిమాలు ‘జెర్సీ, గ్యాంగ్ లీడర్’ సాంగ్స్ ఒక రేంజ్ లో క్లిక్కయ్యాయి. కల్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి, అందుకే ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ సాంగ్స్ కూడా అదే స్థాయిలో ఆకర్షిస్తాయని అందరూ ఆశిస్తున్నారు. నాని ఎప్పటికప్పుడు పెరుగుతున్న క్రేజ్, అనిరుద్ సంగీతం ఈ డీల్‌కు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
‘ది ప్యారడైజ్’ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో మార్చి 26, 2026న వరల్డ్‌వైడ్ రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటి వరకు రెగ్యులర్ షూట్ ప్రారంభం కాకముందే ఇంత భారీ హైప్, రూ.18 కోట్ల ఆడియో రైట్స్ డీల్ సాధించడంతో సినిమా పట్ల ఆసక్తిని చూపిస్తోంది. మొత్తంగా, ‘ది ప్యారడైజ్’ ఆడియో రైట్స్ తో రికార్డు సృష్టించడం నాని స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపించింది. ఇక నాని, శ్రీకాంత్ ఓదెల, అనిరుద్ కాంబో ఈ సినిమాతో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.