ది ఇండియన్ హౌస్ సెట్స్ లో భారీ ప్రమాదం.. అసలేమైందంటే?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న ది ఇండియన్ హౌస్ సెట్స్ లో దారుణం చోటు చేసుకుంది.;
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న ది ఇండియన్ హౌస్ సెట్స్ లో దారుణం చోటు చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలో జరుగుతుండగా, షూటింగ్ లో భాగంగా చిత్ర యూనిట్ ఓ భారీ వాటర్ ట్యాంక్ ను నిర్మించగా, ఆ ట్యాంక్ ఒక్కసారిగా కూలిపోవడంతో చిత్ర యూనిట్ లోని టెక్నికల్ టీమ్ గాయపడినట్టు తెలుస్తోంది.
ట్యాంక్ పగలడంతో ఒక్కసారిగా సెట్ మొత్తం జలమయమైంది. సినిమా లోని ఓ కీలక సీన్ కోసం చిత్ర యూనిట్ సముద్ర నేపథ్యాన్ని క్రియేట్ చేసేందుకు ఓ వాటర్ ట్యాంక్ ను సెట్ వేయగా, బుధవారం ఆ సీన్ ను షూట్ చేస్తున్న టైమ్ లో ప్రమాదవశాత్తూ ఆ వాటర్ ట్యాంక్ కూలిపోయింది. దీంతో అక్కడున్న ఓ అసిస్టెంట్ కెమెరామెన్ కు తీవ్ర గాయాలయైనట్టు సమాచారం.
అసిస్టెంట్ కెమెరామెన్ తో పాటూ మరికొంత మంది చిత్ర యూనిట్ కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారని సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.
వాటర్ ట్యాంక్ కూలిన తర్వాత ది ఇండియన్ హౌస్ సెట్ మొత్తం నీటి మయం అవడంతో అక్కడ గందరగోళం ఏర్పడినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు వీడియోలు చూస్తుంటే అర్థమవుతుంది. అయితే ఈ షూటింగ్ జరుగుతున్న టైమ్ లో హీరో నిఖిల్ సెట్ లోనే ఉన్నాడా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. వంశీ కృష్ణ, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.