ది ఫ్యామిలీ మ్యాన్ 3 ట్రైలర్ రిలీజ్!
చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్ ట్రైలర్ ని శుక్రవారం మధ్యాహ్నం ముంబైలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్లో అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ చేసింది.;
చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్ ట్రైలర్ ని శుక్రవారం మధ్యాహ్నం ముంబైలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్లో అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ చేసింది.ఈ సిరీస్ లో మనోజ్ బాజ్ పేయి ని మరోసారి స్పై ఏజెంట్ శ్రీకాంత్ తివారీగా చూడబోతున్నాం.. ఈ ట్రైలర్లో శ్రీకాంత్ తివారీ తన ఫ్యామిలీకి తాను గూఢచారి ని అని చెప్పడంతో ట్రైలర్ మొదలవుతుంది.ఆయనపై అరెస్టు వారెంట్ తో వాంటెడ్ క్రిమినల్ గా ప్రకటించబడ్డట్టు ఈ ట్రైలర్లో చూడవచ్చు. అలాగే శ్రీకాంత్ తన కుటుంబంతో పారిపోతుండగా అతని మ్యాన్ ఫ్రైడే జెకె ఆయనకి సహాయం చేస్తాడు. కానీ తనను ఇరికించడం కోసం ఈ కుట్ర చేస్తున్నారని, ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారో అని అతను ఆలోచనలో పడతాడు. శ్రీకాంత్ తివారి పతనానికి సూత్రధారి ఎవరో కాదు నిమ్రత్ కౌర్.. అయితే శ్రీకాంత్ ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లమ్ నుండి బయట పడడం కోసం ఒక కొత్త మార్గాన్ని కనుగొనాలి. ఆ కొత్త మార్గం ఏంటి.. అందులో నుండి శ్రీకాంత్ తివారీ ఎలా బయటపడ్డారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
అత్యంత జనాదరణ పొందిన సిరీస్ లలో ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ కూడా ఒకటి.ఇప్పటికే వచ్చిన రెండు సిరీస్ అందర్నీ ఆకట్టుకున్నాయి. తాజాగా మూడో సిరీస్ కూడా రిలీజ్ కాబోతోంది.ఇక ఈ మూడో సీజన్ కి దాదాపు మూడు సంవత్సరాల సమయం పట్టింది. ఇంత టైం తీసుకోవడంతో కొంతమంది అభిమానులు ఈ సిరీస్ పట్ల నిరాశ పడ్డారు. ఈ సిరీస్ రిలీజ్ డేట్ ని ప్రకటించిన సందర్భంలో డైరెక్టర్స్
రాజ్ &డికె ఈ విధంగా చెప్పుకొచ్చారు. కొన్ని సంవత్సరాలుగా ది ఫ్యామిలీ మ్యాన్ పై ప్రేక్షకులు కురిపించిన ప్రేమ మరియు ప్రశంసలు నిజంగా ఆనందానీయమైనవి.. ప్రేక్షకులు చాలా ఓపికగా ఉన్నారని మాకు తెలుసు. మరియు సిరీస్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేయించడం మంచిది కాదని మేము ఫిక్స్ అయ్యాం. ఈ సీజన్లో మరింత హై యాక్టింగ్ యాక్షన్ అట్రాక్టివ్ కథనం, ఉత్కంఠ భరితమైన ప్రదర్శనలు చూస్తారని చెప్పుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ బాగుంది అని చాలామంది నెటిజన్స్ ఈ ట్రైలర్ పై పోస్టులు పెడుతున్నారు.
సిరీస్ విషయానికి వస్తే.. మనోజ్ బాజ్పేయి, జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్, ప్రియమణి, షరీబ్ హష్మి, వేదాంత్ సిన్హ, ఆశ్లేష ఠాకూర్, గుల్ పనాగ్, శ్రేయ ధన్వంతరీలు కీరోల్స్ పోషించారు.ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్-3 ని రాజ్&డికే సుమన్ కుమార్ తో కలిసి రాశారు. సుమిత్ అరోరా సంభాషణలు అందించగా ఈ వెబ్ సిరీస్ కి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు.. అలాగే సుమన్ కుమార్, తుషార్ సేథ్ లు సహ దర్శకులుగా చేశారు.
ఈ సీజన్లో శ్రీకాంత్ తివారికి కొత్త శత్రువులతో పాటు కొత్త సవాళ్లు కూడా సీజన్ 3ను చూసే వాళ్లకు ఒక అద్భుతమైన ఆసక్తికరమైన అనుభూతిగా ఉంటుందని అర్థమవుతుంది. మరి చూడాలి ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 21న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది.