తమ్ముడు డైరెక్టర్.. అక్క కొనిచ్చిన కెమెరాతోనే తొలి ప్రయత్నం..!
నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన సినిమా తమ్ముడు. ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేశారు.;
నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన సినిమా తమ్ముడు. ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేశారు. దిల్ రాజు ఆస్థాన దర్శకులలో ఒకరైన వేణు శ్రీరామ్ ఆ బ్యానర్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చారు. ఐతే నితిన్ తో తమ్ముడు అంటూ ఒక డిఫరెంట్ కథతో రాబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ సినిమాపై బజ్ పెంచగా రిలీజ్ ట్రైలర్ సందర్భంగా డైరెక్టర్ వేణు శ్రీరామ్ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
వేణు శ్రీరామ్ ఈ ఈవెంట్ కి ఫ్యామిలీ మెంబర్స్ ని ఇన్వైట్ చేశారట. ముఖ్యంగా తన అక్క అటెండ్ అయ్యారని చెప్పారు. సినిమా అక్కడ తమ్ముడు కథ అవ్వడం వల్ల అక్కని ఈవెంట్ కి తీసుకొచ్చారు వేణు శ్రీరాం. తనకు అక్కే మొదటి స్నేహితురాలని.. ఐతే అక్క త్వరగా పెళ్లి చేసుకుని వెళ్లిందని అన్నారు. ఇక తన జీవితంలో మొదటి కెమెరా కొనిచ్చింది మా అక్కే అని చెప్పారు వేణు శ్రీరామ్. అక్క బావ కొన్నిచ్చిన కెమెరాతోనే తన మొదటి షార్ట్ ఫిలిం చేశానని చెప్పారు.
తమ్ముడు సినిమా బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ కథతో వస్తుంది. ఐతే ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ఈవెంట్ కి వేణు శ్రీరామ్ ఇలా తన సోదరిని తీసుకొచ్చి ఆమె గురించి ఇలా ప్రస్తావించడం ప్రేక్షకులను అలరిస్తుంది. దర్శకుడిగా తాను ఎంత ఎదిగినా తన అక్క చేసిన సాయం మర్చిపోలేదని డైరెక్టర్ వేణు ని పొగుడుతున్నారు ఆడియన్స్.
దిల్ రాజు దగ్గర పనిచేస్తున్న వేణు శ్రీరామ్ అసోసియేట్ డైరెక్టర్ గా చేస్తూ ఓ మై ఫ్రెండ్ సినిమాతో డైరెక్టర్ గా మారాడు. వేణు శ్రీరామ్ సినిమా అంటూ చేస్తే అది దిల్ రాజు ప్రొడక్షన్ లోనే అన్నట్టుగా ఆయన దగ్గరే ఉండిపోయాడు. వేణు శ్రీరాం నితిన్ తో చేసిన తమ్ముడు సినిమా జూలై 4న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా సినిమాపై అంచనాలు పెంచింది. మరి సినిమా ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. నితిన్ మాత్రం తమ్ముడు సినిమా మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దిల్ రాజు కూడా మంచి కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా అని తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని సినిమా ప్రమోషన్స్ లో చెబుతున్నారు.