'తమ్ముడు' రెమ్యునరేషన్స్.. దిల్ రాజు ఏమన్నారంటే..

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు తమ్ముడు ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.;

Update: 2025-07-02 07:05 GMT

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు తమ్ముడు ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. యంగ్ హీరో నితిన్, డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆ సినిమాను దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించారు. జులై 4వ తేదీన సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.

అదే సమయంలో సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. అనేక ఇంటర్వ్యూలు ఇస్తే ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తమ్ముడు మూవీ హీరో, డైరెక్టర్ రెమ్యునరేషన్స్ కోసం దిల్ రాజు మాట్లాడారు. ప్రస్తుతం నాన్ థియేట్రికల్ మార్కెట్ పరిస్థితిని వివరించగా, ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి.

నితిన్ రాబిన్ హుడ్ రిలీజ్ తర్వాత తమ్ముడు మూవీ బడ్జెట్ ఎక్కువైందని, రెమ్యునరేషన్ ఇవ్వలేనని, సినిమా విడుదలయ్యాక చూస్తామని దిల్ రాజు చెప్పినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ విషయంపై ఇంటర్వ్యూలో దిల్ రాజు రెస్పాండ్ అయ్యారు. అదేం కాదని.. బడ్జెట్ వాళ్ల అలా కాదని క్లారిటీ ఇచ్చారు.

నాన్ థియేట్రికల్ మార్కెట్ అప్పుడూ ఇప్పుడూ చాలా మారిపోయిందని తెలిపారు. నాన్ థియేట్రికల్ మార్కెట్ తో రెమ్యూనరేషన్స్ పెరుగుతూ వచ్చాయని చెప్పారు. నాన్ థియేట్రికల్ రెవెన్యూ మారిందని కాబట్టి చర్చకు వచ్చిందని పేర్కొన్నారు. మీరెంత తగ్గించుకుంటారని తాను అడగ్గా.. డైరెక్టర్ వేణు శ్రీరామ్ ముందు వచ్చారని తెలిపారు.

''నేను అడిగినట్లు నాకు సినిమా తీయనిచ్చారు. 150 రోజులంటే 150 రోజులు తీసే ఛాన్స్ ఇచ్చారు. నేను అందుకే రెమ్యునరేషన్ డ్రా చేయడం లేదు. మీకు డబ్బులు వచ్చాకే నాకు ఇవ్వండి' అని డైరెక్టర్ తెలిపారు. నితిన్ విషయానికొస్తే.. ఇంత అయిందని చెప్పా.. అదంతా ఓపెన్ సీక్రెట్.. అందుకే తగ్గించమని చెప్పారు' అని అన్నారు.

సుధాకర్ రెడ్డి కూడా సినిమా ఫీల్డ్ లోనే ఉన్నారని, ఆయనకు అన్నీ తెలుసని చెప్పారు. నాన్ థియేట్రికల్ మార్కెట్ మారిందని చెప్పారు. డైరెక్టర్ ఇలా చేశారంటే.. మిగతా వారు కూడా అలా చేయమని చెప్పినట్లు వెల్లడించారు. ఇప్పటికే నితిన్, వేణు రెమ్యునరేషన్స్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తమ్ముడు ఈవెంట్ లో కూడా తెలిపారు. మరి తమ్ముడు సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News