మ్యూజిక్ గోల.. రజనీ అలా.. తమన్ ఇలా..
అయితే రీసెంట్గా మ్యూజిక్ విషయంలో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్న కామెంట్స్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే
ఓ సినిమా విజయంలో మ్యూజిక్ కూడా ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ సీన్‌ను సందర్భానికి తగట్టుగా ప్రేక్షకుడికి మరింత దగ్గర చేసి ఆకట్టుకుంటుంది. కొన్నిసార్లు కంటెంట్ స్థాయిని కూడా మరింత బలంగా చూపిస్తుంది. రీసెంట్గా వచ్చిన విక్రమ్, జైలర్, లియో చిత్రాలే నిదర్శనం.
అయితే రీసెంట్గా మ్యూజిక్ విషయంలో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్న కామెంట్స్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. "అక్కడ చచ్చిన శవాన్ని తీసుకొస్తే నేనేమ్ చేస్తా. ఎవరూ ఏమీ చేయలేరు. మూవీ డైరెక్టరే సరైన కంటెంట్ ఇవ్వాలి" అంటూ అన్నారు. దీంతో ఆ మధ్య జైలర్ సినిమా సక్సెస్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన కామెంట్స్ మరోసారి తెరపైకి వచ్చాయి.
రజనీ మాట్లాడుతూ.. అనిరూధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వల్లే జైలర్ సినిమా మరింత స్థాయికి వెళ్లి బ్లాక్ బస్టర్‌హిట్‌గా నిలిచింది అన్నారు. తమన్ ఏమో.. దర్శకుడు సినిమాలోని సీన్స్‌ను, కథలో ఎమోషన్స్‌ను చక్కగా చూపించినప్పుడే మంచి సంగీతం అందించగలమని తమన్ అన్నారు. కథలో ఎమోషన్స్ సన్నివేశాలు సరిగ్గా లేకపోతే.. సంగీత దర్శకుడు ఫీల్‌గుడ్ మ్యూజిక్ కంపోజ్ చేయలేడని అన్నారు.
దీంతో ఈ రెండు కామెంట్స్ సినీ ప్రియులు పోల్చి చూస్తూ.. తమన్ చేసిన వ్యాఖ్యలతో కాస్త తేడాగా ఉన్నాయని అంటున్నారు. జైలర్ కంటెంట్ పరంగా కాస్త తక్కువైనా.. మ్యూజిక్ ఆ సినిమాను బాగా లేపిందని మరోసారి గుర్తుచేస్తున్నారు. అలానే ఇంకొంతమంది రజనీకాంత్-తమన్.. ఇద్దరి ఎవరి కామెంట్స్ కరెక్ట్ అంటూ ఆలోచిస్తున్నారు.
ఏదేమైనప్పటికీ అఖండ తర్వాత ఆ రేంజ్ సెన్సేషన్ మ్యూజిక్ రాలేదనే చెప్పాలి. బ్రో, సర్కారు వారి పాట వంటి చిత్రాలు బాగానే ఉన్నప్పటికీ మరీ హైరేంజ్లో సెన్సేషన్ అవ్వలేదు. ఇక రీసెంట్గా ఆయన అందించిన స్కంద కూడా అంతే. తాజాగా భగవంత్ కేసరి మ్యూజిక్ డీసెంట్‌గా ఉంది తప్పా మరీ ఎక్స్‌ట్రార్డనరీగా ఏమీ లేదు.