త్రివిక్రమ్‌ని అత్తగారు 'శీను' అని పిలుస్తారు.. ఆ తర్వాత వెంకీనే!
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ తాజా ఇంటర్వ్యూలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తనకున్న అనుబంధం, పనితీరు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ తాజా ఇంటర్వ్యూలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తనకున్న అనుబంధం, పనితీరు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సినిమా మేకింగ్ వెనుక జరిగే మ్యాజిక్, క్రియేటివ్ చర్చల గురించి అతడు మాట్లాడిన విషయాలు ఆకట్టుకున్నాయి.
మంచి కాఫీ కప్పుతో మొదలయ్యే కాన్వర్జేషన్స్ తమ వంటి టెక్నీషియన్లకు ఎంతో అవసరమని తమన్ ఈ చిట్ చాట్ లో తెలిపారు. తమకు కావాల్సిందల్లా మంచి కాఫీతో కూడిన కాన్వర్జేషన్ మాత్రమేనని.. అలాంటి సరైన వాతావరణమే తమ పనికి, సృజనాత్మకతకు చాలా బాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
దర్శకుడు త్రివిక్రమ్ గారితో తన అనుబంధం గురించి చెబుతూ..ఆయనను ఇంట్లో అందరూ `ట్రూగమ్` అని, అలాగే `శీను` అని పిలుస్తారని తమన్ తెలిపారు. త్రివిక్రమ్ గారిని వాళ్ళ అత్తగారు `శీను` అని పిలుస్తారని.. ఆ తర్వాత ఆయనను అలా పిలిచేది వెంకటేష్ గారేనని చెప్పారు. వారి మధ్య ఉన్న ఈ కుటుంబ అనుబంధం తనను ఎంతో ఆకట్టుకుందని వెల్లడించారు.
తాను సంగీత దర్శకుడిగా మారకముందు సీనియర్ సంగీత దర్శకుడు కోటి గారి దగ్గర ప్రోగ్రామర్‌గా పని చేసే రోజుల నుంచే త్రివిక్రమ్ గారితో తనకు పరిచయం ఉందని తమన్ గుర్తుచేసుకున్నారు. త్రివిక్రమ్ గారు అప్పట్లో `మణిశర్మ` గారి సినిమాలకు కూడా ఆర్ఆర్ (రీరికార్డింగ్) సమయాల్లో ఎంతో సహకరిస్తూ ఉండేవారని గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
`అరవింద సమేత` సినిమా సమయంలో త్రివిక్రమ్ తనతో మాట్లాడుతూ, ``అద్భుతాలు చేయాలనుకుంటున్నావు.. కానీ నువ్వు ఏమీ చేయడం లేదు``అని అన్నారని తమన్ తెలిపారు. నిజానికి ఆ సమయంలో ఆ సినిమాలోని ఒక ట్యూన్ కోసం ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నా అస్సలు రాలేదని.. ఆ తర్వాత ఆయన మాటలు తనపై ప్రభావం చూపాయని చెప్పారు.
దర్శకునిగా త్రివిక్రమ్ ఆలోచన విధానం చాలా స్పష్టంగా ఉంటుందని తమన్ పేర్కొన్నారు. త్రివిక్రమ్ గారు ఏదైనా అద్భుతం చేయాలని కోరుకుంటారని.. ఆయన చెప్పే చిన్న మాటలు లేదా సూచనలు తన పనిని మెరుగుపరచడానికి ఎంతో సహాయపడతాయని తెలిపారు. ఈ ప్రయాణంలో తాము డ్రెస్ వేసుకోవడం మానేసి, కేవలం సినిమాల గురించిన ఆలోచనలతో స్ట్రెస్ వేసుకొని తిరుగుతున్నామని తమన్ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ ఇంటర్వ్యూలో ఆదర్శకుటుంబం టీమ్ సభ్యులు త్రివిక్రమ్, శ్రీనిధి శెట్టి, సత్య కూడా పాల్గొన్నారు.