• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తమన్‌ మంచి మనసు.. అతడికి...

తమన్‌ మంచి మనసు.. అతడికి ఇండియన్‌ ఐడల్‌లో ఛాన్స్‌!

| ఒక దివ్యాంగుడికి అతి పెద్ద అవకాశాన్ని ఇవ్వడం ద్వారా సహృదయం చాటుకున్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-11-14 04:53 GMT

సంగీత దర్శకుడు తమన్‌ ఎప్పటికప్పుడు తన మంచి మనసును చాటుకుంటూ వస్తున్నాడు. కెరీర్‌ ఆరంభంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్న తమన్‌ తక్కువ సమయంలోనే సంగీత దర్శకుడిగా టాప్ పొజీషన్‌కి చేరుకున్నారు. నటుడిగా, కీ బోర్డ్‌ ప్లేయర్‌గా కెరీర్‌ ఆరంభంలో తాను ఎదుర్కొన్న సవాళ్లను ఎప్పటికీ మరచిపోడు. అందుకే ఇండస్ట్రీలో అవకాశాల కోసం కష్టపడుతున్న వారి గురించి తెలుసుకుని వారికి సాయం చేస్తూ ఉంటాడని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. తాజాగా మరోసారి తమన్‌ తన మంచి మనసును చాటుకున్నాడు. ఒక దివ్యాంగుడికి అతి పెద్ద అవకాశాన్ని ఇవ్వడం ద్వారా సహృదయం చాటుకున్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దివ్యాంగుడు అయిన రాజు మంచి గాయకుడు. ఆ విషయం సోషల్‌ మీడియా ద్వారా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలతో నిరూపితం అయింది. అందుకే ఆయనకు అవకాశం ఇవ్వాలంటూ ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్‌ సైతం ఒకానొక సమయంలో కీరవాణికి విజ్ఞప్తి చేయడం జరిగింది. రాజు సోషల్‌ మీడియాలో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. తాజాగా తమన్ వద్దకు ఒక నెటిజన్‌ రాజు విషయాన్ని తీసుకు వెళ్లాడు. రాజు యొక్క ప్రతిభను తమన్‌కు చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. తమన్‌ నుంచి రాజుకు ఒక స్పష్టమైన హామీ దక్కింది.

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతున్న తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 4లో స్టేజ్‌ పై పాట పాడే అవకాశం కల్పిస్తానని అన్నాడు. అంతే కాకుండా రాజుతో పాటు తాను సైతం ఆ షో లో పాట పాడుతాను అంటూ తమన్‌ హామీ ఇవ్వడం జరిగింది. తెలుగు ఇండియన్ ఐడల్‌ బిగ్గెస్ట్ సిగ్గింగ్‌ షో. అలాంటి స్టేజ్ పై రాజుకు పాట పాడే అవకాశం ఇవ్వడం ద్వారా తమన్‌ ఎంతో గొప్పవాడు అయ్యాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రాజుకు తమన్‌ చేస్తానన్న సాయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరగడం వల్ల తమన్‌ గురించి చాలా పాజిటివ్‌గా కామెంట్స్ వస్తున్నాయి.

తమన్‌ ప్రస్తుతం పలు పెద్ద సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. పుష్ప 2 లోని కొన్ని సన్నివేశాలకు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందించే పనిలో ఉన్న తమన్‌ త్వరలోనే ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అఖండ 2 సైతం తమన్‌ వర్క్ చేస్తున్నాడు. ఇక రామ్‌ చరణ్, శంకర్ కాంబోలో దిల్‌ రాజు నిర్మించిన గేమ్‌ ఛేంజర్‌ కి సైతం తమన్‌ సంగీతాన్ని అందించడం జరిగింది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాలు బ్యాక్ టు బ్యాక్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తమన్‌ ఇతర సంగీత దర్శకులకు పోటీ ఇస్తూ టాప్‌ లో నిలుస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

I will make sure he Performs in #TeluguIndianIdolS4@ahavideoIN pls consider as my request and order 📢❤️🎧⭐️▶️💥

Will have his Special Performance and I will perform along with him ❤️✨🙌🏿

What a Talent what perfect pitching 🖤
God is sometimes harsh
But we humans are there… https://t.co/CqjEU0QHfc

— thaman S (@MusicThaman) November 13, 2024
Tags:    
  • Thaman 
  • Raju 
  • Indianidol 
  • Teluguindianidol 
  • Aha 
  • Thamanmovies 
  • Gamechanger 
  • NBK109 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

ఐకాన్ స్టార్ కోసం గ్యాంగ్ స్ట‌ర్ టైటిల్!

2026-11-12 13:53 GMT

హైందవ 'ఎవరైనా' సాంగ్.. బీచ్ లొకేషన్లో కూల్ కెమిస్ట్రీ

2026-11-12 13:45 GMT

చిన్నతనంలోనే అమ్మానాన్న దూరమై ఇల్లు లేక బాధపడ్డాను!

2026-11-12 13:30 GMT

షారుక్ ఖాన్‌ ఒక్కో ఇల్లు రూ.50 కోట్లు.. అయినా కొనడానికి పోటీపడ్డ కుబేరులు!

2026-11-12 12:30 GMT

బయట 100 కెమెరాలు..లోపల వైట్ సోఫా రూల్!

2026-11-12 11:30 GMT

ఘనంగా మహేష్ బాబు మేనల్లుడి ప్రీ వెడ్డింగ్.. స్పెషల్ పోస్ట్ పంచుకున్న నమృత!

2026-11-12 11:00 GMT

‘వారణాసి’కి రామాయణం చేస్తున్న సాయం

2026-11-12 10:38 GMT

మామ్ గిల్ట్ అంటే ఏంటో అప్పుడే తెలిసింది!

2026-11-12 10:30 GMT

200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆభరణాలు.. కరీనాకపూర్ కు వారసత్వంగా ఇంకేం లభించాయంటే?

2026-11-12 10:05 GMT

'వారణాసి'.. ఏడాదిగా ఒక్కటేనా..

2026-11-12 09:54 GMT

ఇన్‌ఫ్లుయెన్సర్స్ నిజంగా ఆ రేంజ్ లో సంపాదిస్తున్నారా?

2026-11-12 09:45 GMT

నువ్వే నువ్వే నుంచి ఆదర్శ కుటుంబం వరకు.. త్రివిక్రమ్‌లో ఈ మార్పేంటి?

2026-11-12 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS