నందమూరి తమన్ కాస్త కొణిదెల తమన్!
సంగీత దర్శకుడు SS తమన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. డ్రమ్మర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.;
సంగీత దర్శకుడు SS తమన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. డ్రమ్మర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. తనదైన టాలెంట్ తో దూసుకుపోతున్నారు. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నారు.
2009లో మళ్లీ మళ్లీ మూవీతో కెరీర్ ను స్టార్ట్ చేసిన తమన్.. ఇప్పటి వరకు తన కెరీర్‌లో తెలుగు, తమిళం, కన్నడ సహా వివిధ భాషల్లో 100 కి పైగా చిత్రాలకు వర్క్ చేశారు. అయితే టాలీవుడ్ లో మాత్రం తమన్ ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ సినిమాలకు వర్క్ చేసి ఓ రేంజ్ లో మెప్పించారు.
బాలయ్య, తమన్ కాంబోకు మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. నటసింహం డిక్టేటర్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలకు తమన్ స్వరాలు అందించారు. ఆయా సినిమాల విజయంలో తమన్ మ్యూజిక్ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా BGM కు విదేశీ సౌండ్ సిస్టమ్ లు కూడా బ్లాస్ట్ అయ్యాయి.
ఇప్పుడు అఖండ-2కు కూడా ఆయనే వర్క్ చేస్తున్నారు. దీంతో తమన్ ను నందమూరి తమన్ అని పిలుస్తుంటారు ఫ్యాన్స్. ఆయనకు నందమూరి తమన్ అనే ట్యాగ్ ను ఇచ్చేశారు. రీసెంట్ గా బాలయ్య కూడా అదే విషయాన్ని తెలిపారు. అంతే కాదు.. నందమూరి ఫ్యామిలీ ఈవెంట్స్ లో తమన్ కనిపిస్తున్నారు. అంతలా బాలకృష్ణ ఫ్యామిలీతో తమన్ కు మంచి అనుబంధం ఏర్పడిందనే చెప్పాలి.
అయితే ఇప్పుడు తమన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమాకు ఆయన మెయిన్ పిల్లర్ అనే చెప్పాలి. యాక్షన్ సీక్వెన్స్ కు తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. కొన్ని సీన్స్ అయితే థియేటర్స్ లో కేరింతలు.. ఈలలే ఈలలు.
దీంతో ఓజీ మూవీ ఫ్యాన్స్ కు బాగా నచ్చిందంటే ముఖ్య కారణం తమనే. అందుకే ఇప్పుడు.. కొణిదెల తమన్ ను పిలుచుకుంటున్నారు. తమ అభిమాన హీరో సినిమాకు అంతా క్వాలిటీ అండ్ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చినందుకు ఆ ట్యాగ్ ఇచ్చుకుంటున్నారు. దీని బట్టి చూస్తే.. ఫ్యాన్స్ ఎమోషన్స్ కు అంతే లేదని చెప్పాలి. తమ అభిమాన హీరోకు సరైన హిట్ ఇస్తే చాలు.. వాళ్లను ప్రశంసలతో ముంచెత్తుతుంటారు. నెత్తిన పెట్టుకొని తమ అభిమానాన్ని చూపుతుంటారని అర్ధమవుతుంది.
అసలే అనిరుధ్ డామినేషన్ పెరుగుతున్న సమయంలో తమన్ ఇచ్చిన BGM అతనికి మరో ఐదేళ్ళ వరకు బూస్ట్ ఇస్తుందని చెప్పవచ్చు. ఇదివరకే పవన్ తో తమన్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలకు వర్క్ చేశారు. కానీ ఆ సినిమాలకంటే OG కి ఇచ్చిన ట్రాక్ ది బెస్ట్ అనే మాట వినిపిస్తోంది. ఇక రానున్న రోజుల్లో తమన్ ఇంకా ఎలాంటి సౌండ్స్ ఇస్తాడో చూడాలి.