టాలీవుడ్ లో యూనిటీ లేదంటున్న తమన్
తమన్ ఏదైనా ఒక సినిమాకు మ్యూజిక్ ఇస్తే స్పీకర్లు బద్దలైపోతాయనే సంగతి తెలిసిందే.;
తమన్ ఏదైనా ఒక సినిమాకు మ్యూజిక్ ఇస్తే స్పీకర్లు బద్దలైపోతాయనే సంగతి తెలిసిందే. తమన్ ఏ సినిమాకు వర్క్ చేస్తే ఆ హీరోకు అభిమానిగా మారి ఫ్యాన్స్ కు ఏం కావాలో అదే ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే టాలీవుడ్ లోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకరిగా ఉన్నారు. ఎన్నో తెలుగు సినిమాలకు తన మ్యూజిక్ తో సక్సెస్ అందించారు తమన్.
తెలుగులో అనిరుధ్ గా ఈజీగా ఛాన్సులు
తన మ్యూజిక్ తో వరుస అవకాశాలు అందుకుంటున్న తమన్ రీసెంట్ గా చేసిన కామెంట్స్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అనిరుధ్ కు తెలుగులో సినిమాలు ఈజీగా దొరుకుతున్నాయి కానీ తనకు తమిళ సినీ ఛాన్సులు రావడం మాత్రం కష్టమవుతుందని, దానికి కారణం తమిళ ఇండస్ట్రీలో యూనిటీ చాలా ఎక్కువని, ఆ యూనిటీ టాలీవుడ్ లో మిస్ అయిందని తాను అనుకుంటున్నానని తమన్ అన్నారు.
కోలీవుడ్ లో యూనిటీ ఎక్కువ
తమన్ చెప్పిన మాటలు కోలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. అయితే తమన్ చెప్పిన మాట్లలో నిజం లేకపోలేదు. కోలీవుడ్ లో మంచి యూనిటీ ఉంది కాబట్టే అక్కడి సినిమాల్లో ఎక్కువగా నటీనటుల నుంచి, టెక్నీషియన్ల వరకు అందరూ తమిళులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ టాలీవుడ్ లో అలా కాదు, అన్నీ భాషల వారికీ ఇక్కడ ఆదరణ దొరుకుతుంది.
టాలెంట్ ఉన్న ఎవరినైనా టాలీవుడ్ ఎంకరేజ్ చేస్తుంది. కోలీవుడ్ లో యూనిటీ ఎక్కువ అని తమన్ ఇప్పుడు చెప్పిన మాటల్నే గతంలో కూడా పలువురు పలు సందర్భాల్లో ఇన్‌డైరెక్ట్ గా చెప్పారు. కానీ ఇప్పుడు తమన్ ఇలా డైరెక్ట్ గా చెప్పడంతో ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే వాస్తవానికి అనిరుధ్ పరాయి భాషకు చెందిన వాడైనప్పటికీ తన టాలెంట్ తోనే ఇక్కడ అవకాశాలను అందుకుంటున్నారు. అలా అని అనిరుధ్ కు ఛాన్స్ ఇవ్వడాన్ని తమన్ తప్పు పట్టడం లేదు. వేరే భాషల వారికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మన తెలుగు వారికి దక్కాల్సిన అవకాశాలు వేరే భాషల టెక్నీషియన్లకు దక్కుతున్నాయనే వేదన మాత్రమే అతని అభిప్రాయంగా అర్థమవుతుంది.