బాలయ్య మూవీ.. తమన్ అప్డేట్ తో అంతా ఖుష్!
ఇంతలోనే బాలయ్య మరో మూవీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన ఫ్యాన్స్ లో ఫుల్ ఉత్సాహం నింపిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు!;
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒక మూవీ పూర్తి అయిన వెంటనే.. మరో సినిమాను స్టార్ట్ చేస్తున్నారు. నాన్ స్టాప్ గా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. రీసెంట్ గా అఖండ 2: తాండవంతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
మరికొద్ది రోజుల్లో ఆ సినిమాతో థియేటర్స్ లో సందడి చేయనున్నారు. ఇప్పుడు అఖండ 2: తాండవం రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇంతలోనే బాలయ్య మరో మూవీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన ఫ్యాన్స్ లో ఫుల్ ఉత్సాహం నింపిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు!
బాలకృష్ణ.. ఇప్పుడు గోపీచంద్ మలినేనితో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వారిద్దరి కాంబినేషన్ లో వీర సింహా రెడ్డి మూవీ రూపొందగా.. బాక్సఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. అందరినీ ఆకట్టుకుని సందడి చేసింది. దీంతో మరోసారి బాలయ్యతో వర్క్ చేసే ఛాన్స్ ను గోపీచంద్ అందుకున్నారు. ఈసారి పీరియాడిక్ డ్రామా ప్లాన్ చేశారు.
రీసెంట్ గా ఆ సినిమా పూజా కార్యక్రమాలు జరగ్గా.. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ను కూడా మొదలు పెట్టేందుకు మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. ఇంతలోనే బాలయ్య- మలినేని ప్రాజెక్టుగా మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న ఎస్ ఎస్ తమన్.. సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. NBK 111 మ్యూజిక్ వర్క్ ప్రారంభమైందని పోస్ట్ పెట్టారు.
దీంతో ఆయన పోస్ట్ వైరల్ గా మారగా.. మరోసారి తమన్ విశ్వరూపం చూపించనున్నారని నెటిజన్లు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. నిజానికి.. బాలయ్య, తమన్ కాంబినేషన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే నటసింహం సినిమాలకు తమన్ అందించిన మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయింది.
ఇప్పుడు మళ్లీ బాలయ్య మూవీకి సంబంధించి తమన్ మ్యూజిక్ వర్క్ మొదలైందని చెప్పడంతో.. ఈగర్ గా వెయిటింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే NBK 111 మూవీలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. ఆయనకు జోడీగా సీనియర్ నటి నయనతార మరోసారి యాక్ట్ చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో సినిమా నిర్మించనున్నారు.