OG థమన్ విధ్వంసానికి.. ఫ్యాన్స్ పూనకాలు..!
ఇప్పటివరకు బిజిఎం అంటే కొన్ని తమిళ సినిమాల గురించి మాట్లాడుతున్నారు కదా ఓజీ రిలీజ్ తర్వాత ఈ సినిమా గురించే మాట్లాడుతారు అనేలా చెప్పుకొచ్చాడు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ ఇయర్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన ఓజీ సినిమాపై ముందు నుంచి భారీ హైప్ ఉంది. ముఖ్యంగా ఈ సినిమా మ్యూజిక్ విషయంలో ఎక్స్ పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఓజీ గ్లింప్స్ తోనే థమన్ చాలా కొత్తగా ట్రై చేశాడని అనిపించింది. ఇక సాంగ్స్, టీజర్, ట్రైలర్ బిజిఎం వేరే లెవెల్ అనేలా చేశాడు. ఐతే ఓజీ సినిమా రిలీజ్ ముందే థమన్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు.
థమన్ ఎంత కసిగా పనిచేశాడు..
ఇప్పటివరకు బిజిఎం అంటే కొన్ని తమిళ సినిమాల గురించి మాట్లాడుతున్నారు కదా ఓజీ రిలీజ్ తర్వాత ఈ సినిమా గురించే మాట్లాడుతారు అనేలా చెప్పుకొచ్చాడు. ఓజీ కోసం థమన్ ఎంత శ్రద్ధగా పనిచేశాడు.. ఎంత కసిగా వర్క్ ఇచ్చాడు అన్నది సినిమా చూస్తేనే అర్ధమవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్ గా సుజిత్ టేకింగ్ కి థమన్ తన మ్యూజిక్ తో ప్రాణం పోశాడు. ప్యూర్ గూస్ బంప్స్ అది కూడా ఒకటి రెండుసార్లు కాదు తెర మీద పవర్ స్టార్ కనిపించిన ప్రతిసారి థమన్ వాయించుడు షురూ చేశాడు.
ఓజీ విషయంలో థమన్ కి సుజీత్ చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. ఇద్దరు కలిసి ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా ఓజీలో తాను కాదు సుజిత్, థమన్ ఇద్దరు మెయిన్ పిల్లర్స్ అని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు. సినిమా చూశాడు కాబట్టే పవర్ స్టార్ అలా సినిమా కోసం ఇంత కష్టపడిన వాళ్లిద్దరికీ క్రెడిట్ ఇచ్చాడు.
అనిరుద్ ని పక్కకు నెట్టేసిన థమన్..
ఓజీ సినిమా రాత్రి షోస్ పడినప్పటి నుంచి సినిమాలో పవర్ స్టార్ లుక్కు, సుజిత్ డైరెక్షన్ తో పాటు థమన్ మ్యూజిక్ గురించి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో డిస్కషన్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో తమిళ్ లో వరుస క్రేజీ మ్యూజిక్ అందిస్తూ సంచలనంగా మారాడు అనిరుద్. ఐతే ఓజీతో అనిరుద్ ని కూడా థమన్ పక్కన పెట్టేసేలా ఉన్నాడే అనుకున్నారు. ఇప్పుడు సినిమా చూశాక అది ప్రూవ్ అయ్యింది.
థమన్ ఫుల్ టైం ఒక సినిమా మీద డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో ఈ ఓజీ చూశాక అర్ధమైంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అయితే థియేటర్ లో పూనకాలు వచ్చేలా థమన్ మ్యూజిక్ ఉంది. సో ఓజీ థమన్ వీర లెవెల్ మ్యూజిక్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఒక మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు.