లోకల్ ఛానల్‌లో 'జన నాయగన్' క్లిప్...దీని వెనక ఎవరున్నారు?
ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు భారీ షాక్ తగిలింది. సినిమా పైరసీ వీడియో క్లిప్ లీక్ కావడంతో హీరో విజయ్‌తో పాటు మేకర్స్ షాక్‌కు గురయ్యారు.;
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం నేపథ్యంలో సినిమాలకు గుడ్ బై చెబుతూ చేసిన చివరి మూవీ `జన నాయగన్`. సినిమా రిలీజ్ గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. సెన్సార్ వివాదం కారణంగా సినిమా రిలీజ్‌కు బ్రేక్ పడింది. దీంతో ఎప్పుడు రిలీజ్ అవుతోందనే దానిపై ఇప్పటికీ క్లారిటీ లేకపోవడంతో అభిమాన హీరో నటించిన చివరి సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వచ్చేస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు భారీ షాక్ తగిలింది. సినిమా పైరసీ వీడియో క్లిప్ లీక్ కావడంతో హీరో విజయ్‌తో పాటు మేకర్స్ షాక్‌కు గురయ్యారు. ఇప్పటికే లీక్‌కు సంబంధించి ఆరుగురిని అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ సినిమా ఎడిటింగ్ స్టేజ్‌లోనే క్లిప్ లీక్‌కు గురైందనే కామెంట్‌లు వినిపిస్తున్ననేపథ్యంలో దీనిపై ఇప్పటికే ఎడిటర్స్ యూనియన్ క్లారిటీ ఇచ్చేసింది. ఎడిటర్ ప్రదీప్ ఇ.రాఘవ్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. గ్రాఫిక్స్, సౌండ్ మిక్సింగ్‌ను మరింత మెరుగు పరిచేందుకు దర్శకుడు, నిర్మాత అనుమతితోనే ఓ స్టూడియోకి పంపించాడని వివరణ ఇవ్వడంతో క్లిప్ లీక్ వెనక ఎవరున్నారు?
ఎందుకు ఇప్పుడే లీక్ చేశారు? అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో `జన నాయగన్` టీమ్‌కు మరో షాక్ తగిలింది. రిలీజ్ విషయంలో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న ఈ సినిమాకు సంబంధించిన మరో దిగ్భ్రాంతి కరమైన విషయం బయటకు వచ్చింది. ఇంకా రిలీజ్ కానీ ఈ చిత్రానికి సంబంధించిన క్లిప్‌ని కోయంబత్తూర్‌లోని ఓ లోకల్ ఛానల్‌లో ప్రసారం చేయడం షాక్‌కు గురి చేస్తోంది. ఏప్రిల్ 11న కోయంబత్తూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో లోకల్ ఛానల్స్‌లో ఈ సినిమా క్లిప్‌ను ప్రదర్శించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న తమిళగ వెట్రి కళగం నాయకులు చిత్ర ప్రసారాన్ని నిలిపివేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఛానల్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే సినిమా క్లిప్ ఛానల్‌లో ప్రసారం అయినట్టు పార్టీ నాయకులు తెలిపారు. ఇదిఆ ఉంటే ఈ సినిమా లీకులపై దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది. అ నేపథ్యంలోనే సినిమా లోకల్ ఛానల్‌లో ప్రసారం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇది యాదృశ్చికంగానే జరిగిందా? ఎవరైనా దీని వెనకాల వుండి కావాలనే లోకల్ ఛానల్స్‌లో వీడియో క్లిప్ ప్రసారం అయ్యేలా ప్లాన్ చేస్తున్నారా? అన్నది అనుమానాలని రేకెత్తిస్తోంది.
లీకులకు కారణం అంటూ ఎడిటర్‌పై అభిమోగాలు రావడంతో అతనికి మద్దతుగా ఎడిటర్స్ యూనియన్ నిలిచి తన వల్ల వీడియో క్లిప్ లీక్ కాలేదని స్పష్టతనివ్వడంతో లీకేజ్ స్టోరీపై భిన్నాభిప్రాయాలు, పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా లీక్ అయితే లాభపడేది ఎవరు? ..ఎందుకు వీడియో క్లిప్‌ని లీక్ చేశారు? ..దీని వెనుక ఎవరున్నారు? కావాలనే లీక్ చేశారా? అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.