దళపతి బ్రాండ్ తో 400 కోట్లా..

ఆయన క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి ఆయన కొత్త సినిమా 'జన నాయగన్' ప్రి రిలీజ్ బిజినెసే బెస్ట్ ఎగ్జాంపుల్.;

Update: 2025-11-10 04:35 GMT

సౌత్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర కొంతమంది హీరోల స్టామినా వేరే లెవెల్‌లో ఉంటుంది. వాళ్లకు స్టార్ డైరెక్టర్లతో పనిలేదు, వాళ్ల పేరే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్‌తోనే వందల కోట్ల బిజినెస్ జరిగిపోతుంది. ఈ లిస్టులో "దళపతి" విజయ్ ఎప్పుడూ టాప్‌లో ఉంటాడు. ఆయన క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి ఆయన కొత్త సినిమా 'జన నాయగన్' ప్రి రిలీజ్ బిజినెసే బెస్ట్ ఎగ్జాంపుల్.

విజయ్ రీసెంట్‌గా 'GOAT' సినిమాతో ప్రూవ్ చేసింది ఇదే. పెద్ద స్టార్ డైరెక్టర్ లేకపోయినా, ఆ సినిమాకు రికార్డు బిజినెస్ జరిగింది. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతోంది. 'జన నాయగన్' సినిమాకు డైరెక్టర్ హెచ్. వినోత్. 'వలిమై', 'తునివు' లాంటి సినిమాలు తీసినా, వినోత్ ఇంకా లోకేష్ కనగరాజ్, రాజమౌళి రేంజ్ స్టార్‌డమ్‌ను అందుకోలేదు. అయినా సరే, 'జన నాయగన్' బిజినెస్ మాత్రం హై లెవెల్ లో ఉంది. ఇది ప్యూర్ 'విజయ్ మానియా' తప్ప మరొకటి కాదు.

సినిమా రిలీజ్‌కు ముందే మేకర్స్ టేబుల్ ప్రాఫిట్‌తో సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయారు. నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్స్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 'జన నాయగన్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రైమ్ వీడియో ఏకంగా 110 కోట్లకు దక్కించుకుంది. అలాగే, ఫార్స్ ఫిల్మ్స్ సంస్థ ఓవర్సీస్ హక్కుల కోసం 75 కోట్లు చెల్లించి లాక్ చేసింది. అంటే, ఈ రెండు డీల్స్‌తోనే దాదాపు 185 కోట్లు జేబులోకి వచ్చేశాయి.

ఇక థియేట్రికల్ మార్కెట్ విషయానికి వస్తే, విజయ్‌కు తన సొంత గడ్డపై ఎలాంటి పట్టు ఉందో ఈ నంబర్స్ చూస్తే తెలుస్తుంది. తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను రోమియో పిక్చర్స్ ఏకంగా 100 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. విజయ్‌ను ఫ్యాన్స్ ముద్దుగా 'కేరళ కింగ్' అని పిలుస్తారు, దాన్ని ప్రూవ్ చేస్తూ.. కేరళ రైట్స్ కూడా ఇదే సంస్థ 15 కోట్లకు సొంతం చేసుకుంది.

ఈ లెక్కలన్నీ (డిజిటల్, ఓవర్సీస్, తమిళనాడు, కేరళ), ఆడియో రైట్స్‌తో కలిపితే, 'జన నాయగన్' ప్రి రిలీజ్ బిజినెస్ ఇప్పటికే 300 కోట్ల మార్క్‌ను ఈజీగా దాటేసింది. ఇంకా ఈ లెక్క పూర్తి కాలేదు. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్, అలాగే శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్మాల్సి ఉంది. ఇవన్నీ కలిపితే, ఈ సినిమా టోటల్ బిజినెస్ 400 కోట్ల మార్క్‌ను టచ్ చేయడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు ఫిక్స్ అయిపోయారు. ఏదేమైనా డైరెక్టర్, జానర్ సంగతి పక్కన పెడితే, "విజయ్" అనే బ్రాండ్ ఉంటే చాలు అని ఈ నంబర్స్ చెప్తున్నాయి. ఇక 2026 జనవరి 9 పొంగల్ బరిలో దిగుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి తుఫాన్ సృష్టిస్తుందో చూడాలి.

Tags:    

Similar News