'రాజా సాబ్' ఓపెనింగ్స్.. రూ.100 కోట్లు పక్కానా?

సరైన ప్లానింగ్, భారీ రిలీజ్, ప్రభాస్ మార్కెట్ కలిసి వస్తే రూ.100 కోట్ల ఓపెనింగ్స్ సాధించడం పెద్ద విషయం కాదని ఆయన అన్నారు .;

Update: 2026-01-08 12:33 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ మూవీ ది రాజా సాబ్ పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గ్రాండ్ రిలీజ్‌ కు సిద్ధమైన ఆ సినిమా తొలి రోజే బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డు నమోదు చేయబోతోందని నిర్మాత విశ్వప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. సరైన ప్లానింగ్, భారీ రిలీజ్, ప్రభాస్ మార్కెట్ కలిసి వస్తే రూ.100 కోట్ల ఓపెనింగ్స్ సాధించడం పెద్ద విషయం కాదని ఆయన అన్నారు .

ఇటీవల మీడియాతో మాట్లాడిన విశ్వ ప్రసాద్.. రాజా సాబ్‌ కు ఉన్న క్రేజ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "ప్రభాస్ సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితం కాదు. నార్త్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లలో కూడా భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. అన్ని ఏరియాల్లో సరైన థియేటర్ కౌంట్, సరైన షో టైమింగ్స్‌ తో రిలీజ్ చేస్తున్నాం. ఆ లెక్కన చూస్తే తొలి రోజు రూ.100 కోట్ల గ్రాస్ రావడం ఈజీ" అని అభిప్రాయపడ్డారు.

అయితే రాజా సాబ్‌ ను పూర్తి స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రూపొందించామని విశ్వప్రసాద్ చెప్పారు. తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇతర భాషల్లో ఒకేసారి భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేశామని వెల్లడించారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ప్రభాస్‌ కు ఉన్న ఫాలోయింగ్, హారర్ ఫాంటసీ జానర్‌ పై అక్కడి ప్రేక్షకుల్లో ఉన్న ఇంట్రెస్ట్.. సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని విశ్వప్రసాద్ అభిప్రాయపడ్డారు.

అదే సమయంలో తొలి రోజు కలెక్షన్లపై ధీమా వ్యక్తం చేసినప్పటికీ, మౌత్ టాక్ కూడా చాలా కీలకమని నిర్మాత ఒప్పుకున్నారు. ప్రీమియర్ షోల నుంచి పాజిటివ్ టాక్ వస్తే అడ్వాన్స్ బుకింగ్స్ ఒక్కసారిగా పెరుగుతాయని తెలిపారు. అప్పుడు ఓపెనింగ్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటాయని, ప్రభాస్ పేరు చాలు ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి అని అన్నారు. ఆయన సినిమాలు ఓపెనింగ్ డేనే సగం రిజల్ట్ వస్తుందని చెప్పారు.

ఇప్పుడు రాజా సాబ్ విషయంలో అదే జరుగుతుందని నమ్ముతున్నామని అన్నారు. మారుతి తెరకెక్కించిన సినిమా హారర్‌ తో పాటు ఎంటర్టెన్మెంట్ ను అందిస్తుందని చెప్పిన ఆయన.. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేలా కంటెంట్ ఉంటుందని వెల్లడించారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కీలక పాత్రల్లో నటించారని, వారు తమ యాక్టింగ్ తో ఆకట్టుకుంటారని చెప్పారు.

మొత్తంగా చూస్తే రాజా సాబ్‌ పై మేకర్స్ చాలా కాన్ఫిడెంట్‌ గా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కచ్చితంగా తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్ల గ్రాస్ సాధించవచ్చని భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు అంతా మౌత్ టాక్ ఎలా ఉంటుందోనని వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అదే రాజా సాబ్ బాక్సాఫీస్ జర్నీని డిసైడ్ చేయనుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..

Tags:    

Similar News