రాజాసాబ్ నిర్మాత బయటికొచ్చాడు
నిర్మాతగా మొదట్లో కొన్నేళ్ల పాటు వేరే నిర్మాతల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు తీస్తూ అందరిలో ఒకరిలాగే కనిపించారు నిర్మాత టి.జి.విశ్వప్రసాద్.
నిర్మాతగా మొదట్లో కొన్నేళ్ల పాటు వేరే నిర్మాతల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు తీస్తూ అందరిలో ఒకరిలాగే కనిపించారు నిర్మాత టి.జి.విశ్వప్రసాద్. కానీ తర్వాత ఉన్నట్లుండి దూకుడు పెంచారు. పెద్ద హీరోలతో భారీ చిత్రాలకు తోడు.. ఒకేసారి బోలెడన్ని ప్రాజెక్టులు లైన్లో పెట్టి ఇండస్ట్రీకి పెద్ద షాకే ఇచ్చారు ఒక టైంలో ఒకేసారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్లో పాతిక సినిమాల దాకా వివిధ దశల్లో ఉన్నాయంటే ఆయన దూకుడు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
కానీ రాశి ఉంటే సరిపోదు.. వాసి కూడా ఉండాలని, అప్పుడే ఏ నిర్మాత అయినా మనగలుగుతాడని విశ్వప్రసాద్‌కు త్వరగానే అర్థమైంది. పీపుల్ మీడియా బేనర్లో గత కొన్నేళ్లలో వచ్చిన చిత్రాల్లో ధమాకా, మిరాయ్ మినహాయిస్తే దాదాపుగా అన్ని చిత్రాలూ డిజాస్టర్లే అయ్యాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ది రాజాసాబ్’ పెద్ద డిజాస్టర్ కావడంతో విశ్వప్రసాద్ షాక్‌లోకి వెళ్లిపోయారు. ఆ సినిమా రిలీజైన దగ్గర్నుంచి బయటెక్కడా కనిపించలేదు.
ఐతే ఎట్టకేలకు విశ్వప్రసాద్ బయటికి వచ్చారు. కొంత కాలంగా టాలీవుడ్ డ్యాన్సర్ అసోసియేషన్ విభేదాలతో భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి విశ్వప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరేడు నెలలుగా తాను బయటికి రాలేదంటూ మాట్లాడారు. అంతకుముందు కూడా లైమ్ లైట్లో ఉండేవాడిని కాదని.. గత రెండేళ్ల నుంచే యాక్టివ్‌గా ఉంటున్నానని చెప్పిన విశ్వప్రసాద్.. ఇండస్ట్రీలో మిడిల్ మెన్ గురించి మరోసారి గళం విప్పారు. తన సినిమాల్లో పని చేసే కార్మికులకు తాను ఇచ్చే ప్రతి రూపాయి వాళ్లకే నేరుగా చేారాలన్నది తన ఉద్దేశమని ఆయనన్నారు.
తాను ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో వంద పాటలు ఉంటే.. అందులో లోకల్ డ్యాన్సర్లు ఉన్న పాటలు 50 కూాడా ఉండవని ఆయనన్నారు. ఇలాంటి అంశాల మీద మాట్లాడితే తాను యూనియన్ వాళ్లకు వ్యతిరేకం అన్నట్లు ముద్ర వేశారని.. కానీ తన ఉద్దేశం మధ్యవర్తులు లేకుండా మన సినీ కార్మికులకు నేరుగా డబ్బులు చేరాలి, వృథా ఖర్చు ఉండకూడదన్నదే తన ఉద్దేశమని ఆయన వ్యాఖ్యానించారు.