దమ్ముంటే ఇండియాకు రా అన్వేష్.. ఎవరూ నిన్ను వదలరు: యూట్యూబర్ అజయ్

తెలుగు యూట్యూబర్ అన్వేష్‌ కు సంబంధించిన వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అన్వేష్ పై అనేక మంది మండిపడుతున్నారు.;

Update: 2026-01-04 04:24 GMT

తెలుగు యూట్యూబర్ అన్వేష్‌ కు సంబంధించిన వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అన్వేష్ పై అనేక మంది మండిపడుతున్నారు. ఇప్పుడు మరో టాప్ యూట్యూబర్ అజయ్.. హాయ్ అన్వేష్ పార్ట్ 2తో మరో వీడియో రిలీజ్ చేశారు. అందులో తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

"హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారికి చిన్న రిక్వెస్ట్.. అన్వేష్ విషయంలో రెస్పాండ్ అయ్యారని వార్తలు వచ్చాయి.. ఐబొమ్మ రవిని ఎలా తీసుకొచ్చామో.. ఇప్పుడు అన్వేష్ కోసం కూడా అన్నట్లు వార్తలొచ్చాయి. అందులో నిజమెంతో తెలియదు కానీ ప్రెస్ మీట్ పెట్టండి.. అన్వేష్ విషయంపై టైమ్ పర్మిట్ ఉంటే దృష్టి పెట్టండి" అని అజయ్ కోరారు.

"నేను ఎంటైర్ కమ్యూనిటీ తరఫు మాట్లాడుతున్నా సర్. సీతమ్మ కోసం మాట్లాడుతూ నా కంటస్ట్ అది కాదు సారీ చెప్పిన వినరేంటి అంటున్నాడు. మలేసియాలో ఉండి ఎవరు రారని ధైర్యం ఉంది. మీరు ప్రెస్ మీట్ తో ధైర్యమేంటో చూపించాలి. మతపరమైన విషయంలో ఎవరిని హర్ట్ చేయకూడదు. దీన్ని వైరల్ చేసి సజ్జనార్ గారికి చేరేలా చేద్దాం" అని అన్నారు.

"ధర్మంపై చేస్తున్న యుద్ధంలో నేను వారధి మాత్రమే. నాకు కాల్ చేయమని చెబుతున్నావ్ కదా. టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేయద్దు, దమ్ముంటే ఇండియా వచ్చి ఎఫ్ఐఆర్ ఫేస్ చేయ్.. నీ ఆడియో, వీడియో లీక్స్ పెట్టను.. ఒక్కొక్క విషయం బయట పెడతా. ఎత్తుకుపై ఎత్తు వేస్తావ్ అన్నావ్. కానీ అవే నీకు మింగేస్తాయి గుర్తుంచుకో. వెన్నులో వణుకు పుట్టాలి" అని చెప్పారు.

"శివాజీ కామెంట్స్ పై మాట్లాడుతూ.. తక్కువ డ్రెస్సులు వేసుకుంటే మానభంగాలు చేస్తారా.. ఫుల్ గా వేసుకున్నా జరుగుతాయంటూ ద్రౌపదీ, సీతమ్మ తల్లిని ఎగ్జాంపుల్ తీసుకుంటావా? బూటు కాలుతో రొమ్ముపై కొట్టి సారీ చెప్పి అయితే ఏంటి? నీవు లీగల్ గా ఫేస్ చెయ్.. అప్పుడే సారీ చెప్పు. నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడితే.. ఆంజనేయుడు ఊరుకుంటాడు అనుకున్నావా.. ఖబడ్దార్" అంటూ హెచ్చరించారు.

"ఇండియా వద్దామనుకుంటే అన్వేష్ కు బిజినెస్ టికెట్ క్లాస్ తో టికెట్ వేస్తా.. ఎయిర్ పోర్ట్ నుంచి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు కారు పెడతా.. వెళ్లి ఎఫ్ఐఆర్ ఫేస్ చెయ్.. వాళ్ళు అడిగిన వాటికి ఆన్సర్లు చెప్పు.. నా కుటుంబంపై చేసిన ఆరోపణలపై పరువు నష్టం దావా వేస్తా. నీ బాగోతం బయట పెడతా.. ఆంజనేయ స్వామి మాల వేసేవాళ్లను నీవు అంటావా?" అని ప్రశ్నించారు.

"నాకు పార్టీలతో సంబంధం లేదు. ఎవరు తప్పు చేసినా ఒపీనియన్ చెబుతా. దేవుడిని గుండెలో పెట్టుకుని బతకాలి. స్వామి మాల వేసుకుంటే నన్ను అంటావా? బలి చక్రవర్తిలా నామా రూపాలు లేకుండా చెరిగిపోతావ్. ఎవరూ నిన్ను చూసి ఊరుకోరు. క్రైస్తవులు, ముస్లింలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. నన్ను బ్లాక్ మెయిల్ చేస్తావా? నా బొ*చ్చు కూడా పీ*కలేవు. అంతా ఒక్కటవ్వాలి" అంటూ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News