టాలీవుడ్ కి జపాన్ సెకెండ్ హోమ్!
ఒకప్పుడు తెలుగు సినిమా అంటే రీజనల్ మార్కెట్ కే పరిమితం. తెలుగు రాష్ట్రాల నుంచే అధికంగా వసూళ్లు రాబట్టేవి.;
ఒకప్పుడు తెలుగు సినిమా అంటే రీజనల్ మార్కెట్ కే పరిమితం. తెలుగు రాష్ట్రాల నుంచే అధికంగా వసూళ్లు రాబట్టేవి. మిగతా వసూళ్లు సౌత్ లో ఉన్న రాష్ట్రాల నుంచి అమెరికా లాంటి ఓవర్సీస్ మార్కెట్ నుంచే భారీ వసూళ్లు కనిపించేవి. ప్రత్యేకించి నార్త్ అమెరికాలో తెలుగు సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవ్వడంతో ? అక్కడ మార్కెట్ ప్రధానంగా చర్చకొచ్చేది. తెలుగు నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా? మంచి వసూళ్లు రాబట్టేవి. హిట్ టాక్ వచ్చిందంటే? వసూళ్లతో బాక్సాఫీస్ కళ కళలాడేది. అటుపై తెలుగు సినిమా పాన్ ఇండియాలో సత్తా చాటడం మొదలు పెట్టిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా సరి కొత్త రికార్డలు దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది. ఇప్పటికే `పుష్ప`, `సాహో` లాంటి చిత్రాలు నార్త్ బాక్స్ ని ఏ రేంజ్ లో షేక్ చేసాయో చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ ను రూల్ చేసే స్థాయికి చేరింది. ఇప్పుడు భారతీయ చిత్రమంటే ముందుగా గుర్తొచ్చేది తెలుగు సినిమానే. గత కొన్నాళ్లుగా తెలుగు సినిమాలు జపాన్ లో కూడా ఏ రేంజ్ లో విజయం సాధిస్తున్నాయో చెప్పాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు ఏక కాలంలో వివిధ దేశాల్లో రిలీజ్ అవుతున్నా? జపాన్ లో ఫేమస్ అయినంతగా తెలుగు సినిమా మరో దేశంలో సంచలనం కాలేదు.
చైనాలో `దంగల్` లాంటి సినిమా రికార్డులు నమోదు చేసినా? అది హిందీ సినిమా కోటాలోకి పోతుంది. తెలుగు పరంగా చూస్తే జపాన్ మార్కెట్ కీలకంగా మారింది. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్లకు అక్కడ ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ క్రేజ్ తోనే 30 ఏళ్ల క్రితం నాటి `ముత్తు` రికార్డును జపాన్ లో `ఆర్ ఆర్ ఆర్` బ్రేక్ చేసింది. `ఆర్ ఆర్ ఆర్` జపాన్ లో ఏకంగా 500 రోజులు పాటు థియేటర్లలో ఆడింది.
మొత్తంగా అక్కడ మార్కెట్ నుంచి 130 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అంతకు ముందు `బాహుబలి` మంచి కలెక్షన్స్ సాధించింది. `దేవర` కూడా జపాన్ లో బ్లాక్ బస్టర్ అయింది. త్వరలో `పుష్ప 2` కూడా రిలీజ్ అవుతుంది. అనంతరం `వారణాసి`, బన్నీ 26వ చిత్రం ఇలా అన్ని చిత్రాలు జపాన్ మార్కెట్ టార్గెట్ గా రిలీజ్ అయ్యేవే. దీంతో తెలుగు సినిమాకు జపాన్ అన్నది సెకెండ్ హోమ్ గా మారుతంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.