ఫ్లాప్స్ తర్వాత రైజ్ అవ్వనున్న టాలీవుడ్? ఈ స్టార్ హీరోలే కీ ఫ్యాక్టర్?

టాలీవుడ్‌కు 2026 మొదటి ఆరు నెలలు అంతగా కలిసిరాలేదు. 'మా ఇంటి బంగారం' వంటి కొన్ని సినిమాలు మినహా, 'ది రాజా సాబ్', 'ఉస్తాద్ భగత్ సింగ్' లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

Update: 2026-07-01 05:53 GMT

టాలీవుడ్‌కు 2026 మొదటి ఆరు నెలలు అంతగా కలిసిరాలేదు. 'మా ఇంటి బంగారం' వంటి కొన్ని సినిమాలు మినహా, 'ది రాజా సాబ్', 'ఉస్తాద్ భగత్ సింగ్' లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అయితే, జూలై నుండి టాలీవుడ్‌కు అసలైన పరీక్ష మొదలుకాబోతోంది. రాబోయే ఆరు నెలల్లో పాన్ ఇండియా సినిమాలు, క్రేజీ సీక్వెల్స్, స్టార్ హీరోల రీఎంట్రీలతో థియేటర్లు కళకళలాడనున్నాయి. ఈ సెకండ్ హాఫ్‌లో రాబోతున్న సినిమాలే టాలీవుడ్ భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నాయి.

జూలై నెల.. కంటెంట్ నమ్ముకున్న సినిమాలు:

జూలై నెలలో స్టార్ పవర్ కంటే ఎక్కువగా కథను నమ్ముకున్న సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఇక ఇందులో రూ. 130 కోట్ల భారీ బడ్జెట్‌తో అనంత పద్మనాభస్వామి టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న మైథాలజికల్ ఫాంటసీ మూవీ 'నాగబంధం' పై మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే మహేష్ బాబు సమర్పణలో, వెంకటేష్ మహా డైరెక్షన్‌లో వస్తున్న సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్' కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాగా ఇండస్ట్రీలో టాక్ తెచ్చుకుంది. అఖిల్ అక్కినేనికి ఈ నెలలో రాబోతున్న 'లెనిన్' సినిమా చాలా కీలకం కానుంది.

ఆగస్ట్‌లో స్టార్ హీరోల వేట.. రవితేజ 'ఇరుముడి':

ఆగస్ట్ నెల మాత్రం స్టార్ హీరోల సందడితో నిండిపోనుంది. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న మాస్ మహారాజా రవితేజకు ఆగస్ట్ 21న రిలీజ్ కాబోతున్న 'ఇరుముడి' సినిమా చాలా ముఖ్యం. శబరిమల బ్యాక్‌డ్రాప్, తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్‌తో వస్తున్న ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. అలాగే నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ 'ది పారడైజ్', సూర్య నటిస్తున్న 'విశ్వనాథన్ & సన్స్' మరియు కన్నడ స్టార్ యష్ 'టాక్సిక్' సినిమాలు కూడా ఆగస్ట్ రేసులోనే ఉన్నాయి.

పెళ్లి తర్వాత విజయ్-రష్మిక 'రణ బాలి':

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఒక మంచి కమర్షియల్ హిట్ కోసం కష్టపడుతున్నాడు. ఆయన నటిస్తున్న 'రణ బాలి' సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక విజయ్, రష్మిక మందన్నల పెళ్లి తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. షూటింగ్ కాస్త బ్యాలెన్స్ ఉండడం వల్ల ఈ సినిమా పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఇదే నెలలో అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక'తో, కార్తీ 'సర్దార్ 2'తో థియేటర్లలోకి రానున్నారు.

దసరా, దీపావళికి క్రేజీ సీక్వెల్స్, మల్టీస్టారర్స్:

అక్టోబర్ 2న దసరా కానుకగా వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో 'ఆదర్శ కుటుంబం' రిలీజ్ కానుందని సమాచారం. ఇక నవంబర్‌లో యూత్‌లో భారీ క్రేజ్ ఉన్న 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ కోసం తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ మళ్లీ జతకడుతున్నారు. ఇక డిసెంబర్‌లో ప్రభాస్-హను రాఘవపూడిల మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఫౌజీ' విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్దన్' బాలయ్య గోపీచంద్ మలినేనిల మాస్ ఎంటర్‌టైనర్, మరియు చిరంజీవి 'విశ్వంభర' సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.

టాలీవుడ్‌కు ఈ 2026 సెకండ్ హాఫ్ ఒక అగ్నిపరీక్ష లాంటిదే. ఇందులో సగం సినిమాలు క్లిక్ అయినా ఇండస్ట్రీ మళ్లీ ఫామ్‌లోకి వస్తుంది. ఒకవేళ తేడా కొడితే మాత్రం పెరుగుతున్న బడ్జెట్లు తగ్గుతున్న థియేటర్ ఆడియన్స్ సంఖ్యపై ఇండస్ట్రీలో పెద్ద చర్చలు జరగడం ఖాయం. మరి మన స్టార్ హీరోలు టాలీవుడ్‌ను ఎలా గట్టెక్కిస్తారో చూడాలి..

Tags:    

Similar News