థియేటర్లో ప్రేక్షకులు కరువు.. ఏం చేస్తే ఫుట్ ఫాల్స్ పెరుగుతాయ్..?
ఓ పక్క తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటూ అకడమీ అవార్డులను సైతం తెచ్చుకుంటుంటే మరోపక్క అసలు సినిమాలు చూడటమే మానేస్తున్న ఆడియన్స్ సంఖ్య పెరుగుతుంది.;
ఓ పక్క తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటూ అకడమీ అవార్డులను సైతం తెచ్చుకుంటుంటే మరోపక్క అసలు సినిమాలు చూడటమే మానేస్తున్న ఆడియన్స్ సంఖ్య పెరుగుతుంది. ఇదివరకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ హంగామా వేరేలా ఉండేది. స్టార్ సినిమా ఐతే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు ఆ సందడి అంతా కూడా మాయమైంది. ఏదో కొన్ని చోట్ల తప్పితే ఆ ఉత్సాహం.. ఆ జోష్ అసలు కనిపించట్లేదు.
అంతేకాదు ఇదివరకు స్టార్ సినిమాలు ఎలా ఉన్నా కూడా ఒకసారి చూసే వాళ్లు.. కానీ ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా సినిమా బాలేదని తెలిస్తే చాలు చూడట్లేదు. ఇదివరకు యావరేజ్ సినిమాలను కూడా ఒకసారి చూసే వాళ్లు. కానీ ఇప్పుడు సినిమా సూపర్ అంటే తప్ప కదల్లేని పరిస్థితి ఏర్పడింది.
పెద్ద బడ్జెట్ తో భారీ స్టార్ కాస్ట్..
కేవలం ఆడియన్స్ పెద్ద బడ్జెట్ తో భారీ స్టార్ కాస్ట్.. భారీ కాన్వాస్ తో తీసిన సినిమాలను మాత్రమే ఆడియన్స్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు ఒకప్పుడు చిన్న సినిమాలు.. కంటెంట్ ఉన్న సినిమాలకు మంచి టాక్ వస్తే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు వచ్చి చూసే వాళ్లు. కానీ ఇప్పుడు చిన్న సినిమా మంచి టాక్ వచ్చినా పట్టించుకోవట్లేదు. నెల రోజుల్లో ఓటీటీలో ఎలాగు వస్తుందిగా అని ఆగిపోతున్నారు.
కొన్ని సినిమాలకు ఆ కాంబినేషన్స్ వల్లో.. లేదా బీభత్సమైన ప్రమోషన్స్ వల్లో కాస్త పాజిటివ్ బజ్ వచ్చి థియేటర్లకు కదులుతున్నారు. ఐతే స్టార్ సినిమాలకే ఇది జరుగుతుంది కానీ చిన్న సినిమాలకు మాత్రం అసలేమాత్రం ఫుట్ ఫాల్స్ రావట్లేదు. ఒక సినిమా రిలీజ్ టైం లో చేసే ప్రమోషన్స్ కూడా ప్రేక్షకులు ఆ సినిమా చూసేందుకు ఆసక్తి కలిగుస్తున్నాయి. అందుకే కొన్ని సినిమాలు ప్రమోషన్స్ వల్ల జనాకర్షణగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి.
ఆడియన్స్ సినిమా చూడకపోవడానికి రీజన్..
మెయిన్ గా అసలు థియేటర్లలో ఆడియన్స్ సినిమా చూడకపోవడానికి రీజన్ గా టికెట్ రేట్లు ఒకటి కారణం కాగా.. సినిమా రిలీజ్ అయ్యాక ఎలాగు నెలలోపే ఓటీటీలో వస్తుంది కదా అనే పరిస్థితి కూడా దీనికి కారణమవుతుంది.
70 ఎం.ఎం తెర మీద చూడాల్సిన సినిమాను కేవలం ఆరు ఇంచెస్ స్క్రీన్ లేదా ఇంట్లో టీవీ, కంప్యూటర్ లో చూద్దాం అనుకుంటున్నారు. ఐతే అలా చూడటం వల్ల ఆడియన్ ఏం మిస్ అవుతున్నాడన్నది ఇంకా అర్ధం కావట్లేదు.
బంచ్ ఆఫ్ పీపుల్ కలిసి సినిమా.. అది కూడా పెద్ద తెర మీద బొమ్మ చూస్తే.. అక్కడ తెర మీద ఎమోషన్స్ కి మనతో వచ్చే వాళ్లతో కలిసి మనం కనెక్ట్ అవుతాం. నవ్విస్తే నవ్వుతాం.. ఏడిపిస్తే ఏడుస్తాం.. ఫైట్స్, అడ్వెంచర్ ఇలా అన్ని ఎమోషన్స్ ఫీల్ అవుతాం. కానీ ఇంట్లో అదే మన ఓటీటీలో సినిమా చూస్తే ఇవేవి ఉండవు.
సరే పెద్ద బడ్జెట్ సినిమాలకు టికెట్ హైక్స్ వల్ల ఆడియన్స్ సినిమాకు వెళ్లట్లేదు అనుకుంటే చిన్న సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చాక కూడా జనాలు థియేటర్లో సినిమా చూడటానికి సుముఖంగా లేరు. కంటెంట్ బాగుంటే థియేటర్లకు పరుగెత్తే ఆడియన్స్ లో ఈ మార్పు అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది.
మంచి కంటెంట్ తో సినిమాలు వస్తున్నా కూడా..
ఉదహరణకి చూస్తే రీసెంట్ గా వచ్చిన సుందరకాండ, బార్బరిక్ రెండు సినిమాలు మంచి కంటెంట్ తో వచ్చాయి. రెండు సినిమాలు చూసిన వాళ్లు బాగుందని అన్నారు. కానీ కలెక్షన్స్ మాత్రం అసలు ఏమీ రావట్లేదు. సినిమా బాగున్నా కూడా ఫుట్ ఫాల్స్ లేకపోవడం నిర్మాతలను మరింత డైలమాలో పడేస్తుంది.
ఒకప్పటిఒలా థియేటర్ కి ఆడియన్స్ రావాలంటే ఏం చేయాలన్నది దర్శక నిర్మాతలు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. థియేటర్ సిస్టెం లో మార్పులు తీసుకు రావాల్సి ఉంటుంది. సినిమా చూసేలా ఆడియన్స్ కి మంత్లీ పాస్ రూపంలో ఏదైనా ఆఫర్స్ ఇవ్వాలి. అంటే ఆ పాస్ తో ఒక పెద్ద సినిమా రెండు, మూడు చిన్న సినిమాలు చూసే అవకాశం కల్పించాలి. ఇలా ఈ పాస్ ల వల్ల ఫుట్ ఫాల్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది.
ఆడియన్స్ థియేటర్లకు వచ్చే విషయంపై..
ఈమధ్య సినిమాలు కంటెంట్ బాగుంటున్నాయి.. ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. అయినా కూడా థియేటర్ కి వచ్చి సినిమా చూసే ఆడియన్స్ ఉండట్లేదు. ఈ విషయంలో ప్రొడ్యూసర్స్ కూడా తలలు పట్టుకుని ఉన్నారు. ముఖ్యంగా చిన్న సినిమాల నిర్మాతలు ఈ ఇష్యూపై చర్చలు జరుపుతున్నారు. ప్రొడ్యూసర్స్ అంతా కలిసి థియేటర్ సిస్టెం మీద.. టికెట్ రేట్ల మీద.. ఆడియన్స్ థియేటర్లకు వచ్చే విషయంపై డెసిషన్ తీసుకుని దానికి కావాల్సిన మార్పులు చేయాల్సి ఉంటుంది.
అప్పుడే ఆడియన్స్ థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే పరిస్థితి కనిపిస్తుంది. అలా కాకుండా పరిస్థితి ఇదే విధంగా ఉంటే సినిమాలు చేయడానికి కూడా నిర్మాతలు భయపడే పరిస్థితి ఏర్పడుతుంది.మరి థియేటర్లకు జనాలను రప్పించడానికి నిర్మాతలు ఏం చేస్తారన్నది చూడాలి.