గుట్టు చ‌ప్పుడు కాకుండా ED విచార‌ణ‌లో తెలుగు న‌టుడు?

అయితే తాను కంపెనీ ఉత్ప‌త్తుల ప్ర‌చార‌క‌ర్త‌గా వాణిజ్య‌ ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించినందుకు ఈ కేసు అత‌డి మెడ‌కు చుట్టుకుంద‌ని, సుమారు నాలుగు గంట‌లు పైగా ఈడీ అత‌డిని విచారించింద‌ని ప్ర‌ముఖ మీడియా త‌న క‌థ‌నంలో పేర్కొంది.;

Update: 2025-09-25 13:02 GMT

దాదాపు 800 కోట్ల మేర మోసానికి పాల్ప‌డిన పాపుల‌ర్ ఇన్ ఫ్రా కంపెనీ ప్ర‌క‌ట‌న‌లతో ప్ర‌చారం చేసినందుకు గాను ప్ర‌ముఖ తెలుగు న‌టుడు చిక్కుల్లో ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. అత‌డు ఈరోజు గుట్టు చ‌ప్పుడు కాకుండా ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన‌ట్టు తెలుస్తోంది. నిజానికి స‌ద‌రు హీరోపై ఇంత‌కుముందు ఎలాంటి పోలీస్ కేసులు లేవు. అయినా అత‌డు తీవ్ర‌మైన ఈడీ విచార‌ణ‌కు హాజ‌రు కావ‌డానికి కార‌ణాలేమిటా? అన్న‌ది అభిమానులను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

అయితే తాను కంపెనీ ఉత్ప‌త్తుల ప్ర‌చార‌క‌ర్త‌గా వాణిజ్య‌ ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించినందుకు ఈ కేసు అత‌డి మెడ‌కు చుట్టుకుంద‌ని, సుమారు నాలుగు గంట‌లు పైగా ఈడీ అత‌డిని విచారించింద‌ని ప్ర‌ముఖ మీడియా త‌న క‌థ‌నంలో పేర్కొంది. దాదాపు 700 మంది క‌స్ట‌మ‌ర్ల‌ను 800 కోట్ల మేర ముంచిన ఇన్ ఫ్రా కంపెనీ 120కోట్ల‌తో 21 ప్రాప‌ర్టీల‌ను కొనుగోలు చేసింది. డ‌బ్బును షెల్ కంపెనీల ద్వారా విదేశాల‌కు పంపింద‌ని కూడా ఈడీ చెబుతోంది.

అలాంటి మోస‌పూరిత కంపెనీకి స‌ద‌రు హీరో గారు ప్ర‌మోష‌న్స్ చేసారు. దీంతో అత‌డికి ముట్టిన డ‌బ్బు ఎలా వ‌చ్చింది? ఏఏ మార్గాల‌లో వ‌చ్చింది? అనేది ఈడీ ఆరా తీసిన‌ట్టు తెలుస్తోంది. నేరపూరిత‌ కంపెనీల‌తో అంట‌కాగినందుకు ఇలాంటి విచార‌ణ ఎదుర్కోవాల్సి వ‌స్తోంద‌ని స‌మాచారం.

Tags:    

Similar News