'జాంబిరెడ్డి-2' తేదీ సరే? కెప్టెన్ ఎవరు?
యంగ్ హీరో తేజ సజ్జా పుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.;
యంగ్ హీరో తేజ సజ్జా పుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. `హనుమాన్` అనంతరం `మిరాయ్` తో మరో పాన్ ఇండియా సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. రెండు సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరిన చిత్రాలు కావడంతో తేజ పేరు అన్ని చోట్లా హాట్ టాపిక్ మారింది. సరైన స్టోరీలు ఎంచుకో వడంతోనే ఇది సాద్యమవుతుంది? అన్నది సక్సెస్ రూపంలో కనిపిస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పనిచేసిన అనుభవం.. సినిమాలపై తనకున్న ప్యాషన్ ప్రతీది కళ్ల ముందు కనిపిస్తుంది. భవిష్యత్ లో ఇంకా పెద్ద స్టార్ అవుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు.
హిట్ సినిమాకు సీక్వెల్:
ఈ నేపథ్యంలో తదుపరి చిత్రాల విషయంలో అంతే ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు. `జాంబిరెడ్డి 2`ని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన `జాంబిరెడ్డి` భారీ విజయం సాధించడంతో? పార్ట్ 2 కూడా ఉంటుందని అప్పుడే వెల్లడించారు. కానీ మధ్యలో అనూహ్యంగా కొత్త ప్రాజెక్ట్ లకు కమిట్ అవ్వడం..ముందుగా వాటిని పట్టాలెక్కించడంతో `జాంబిరెడ్డి 2` డిలే అవుతుంది. ఈ నేపథ్యంలో తదుపరి తాను తీసేది జాంబిరెడ్డి 2 అని తేజ చెప్పేసాడు. మరి ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? అంటే ఇంకా ఫైనల్ కాలేదు.
రెట్టింపు వినోదంతో:
ప్రశాంత్ వర్మ ఈసారి కేవలం రచన వరకే పరిమితమయ్యాడు. బ్యాకెండ్ వర్క్ చేస్తాడు తప్ప తాను ముందుకొచ్చి డైరెక్ట్ చేయనని చెప్పేసాడు. దీంతో ఇప్పుడా ప్రాజెక్ట్ కి డైరెక్టర్ ని సెట్ చేసే పనిలో ఉందా ద్వయం.ఈసారి `జాంబిరెడ్డి 2` రెట్టింపు వినోదం ఉంటుందని తెలిపారు. ఈ కథ కోసం ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించినట్లు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని కూడా పీపూల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. జనవరి నుంచి పట్టాలెక్కించాలని నిర్మాణ సంస్థ ప్రణాళిక సిద్దం చేస్తోంది.
ఆ రేంజ్ లో రిలీజ్:
కానీ దర్శకుడు ఎవరు? అన్నది మాత్రం ఇంత వరకూ క్లారిటీ రాలేదు. అలాగే ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తారా? రీజనల్ మార్కెట్ కే పరిమితం చేస్తారా? అన్నది చూడాలి. `జాంబిరెడ్డి` మాత్రం స్థానికంగా రిలీజ్ అయిన చిత్రమే. కానీ తేజ నేడు పాన్ ఇండియా స్టార్ అయిన నేపథ్యంలో `జాంబిరెడ్డి2` రిలీజ్ ఆ రేంజ్ లో ప్లాన్ చేస్తారా? అన్నది చూడాలి. ప్రస్తుతం తేజ `మిరాయ్` సక్సెస్ ని ఆస్వాదిస్తున్నాడు. త్వరలోనే విదేశాలకు వెకేషన్ కు వెళ్లను న్నట్లు సమాచారం.