తేజ సజ్జా.. బాబు ఫ్యాన్స్ మళ్ళీ హార్టయ్యారుగా..
టాలీవుడ్‌లో యంగ్ హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తేజా సజ్జా, వరుసగా కొత్త కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.;
టాలీవుడ్‌లో యంగ్ హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తేజా సజ్జా, వరుసగా కొత్త కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇక నెక్స్ట్ రాబోతున్న మిరాయ్ మూవీపై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయింది. ట్రైలర్, పాటలు సినిమాకు మరింత పాజిటివ్ బజ్ తీసుకొచ్చాయి.
కానీ ఈ ప్రమోషన్ హడావుడి మధ్యలో తేజా ఒక కామెంట్ చేసి మహేష్ బాబు అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. రీసెంట్ ఈవెంట్‌లో ఆయన, రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ ప్రాజెక్ట్‌ను “SSRMB” అంటూ రిఫర్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు కోపంతో కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్‌ను రాజమౌళి కూడా ఎప్పటినుంచో SSMB29గానే పిలుస్తున్నారు.
మహేష్ అభిమానుల అభిప్రాయం ప్రకారం, ఈ సినిమా పూర్తిగా మహేష్ బాబు స్టార్ పవర్‌పై నడుస్తోంది. అందుకే SSMB29 అనే ట్యాగ్ పర్ఫెక్ట్ అని వాళ్లు అంటున్నారు. కానీ తేజా “SSRMB” అని పిలవడం వాళ్లకి తక్కువ చేసి చూపించినట్టుగా అనిపించింది. SSR అంటే రాజమౌళి పేరు ముందు, ఆ తరువాత MB అంటే మహేష్ బాబు అని అర్ధం వస్తుందని తెలిసినా, ఫ్యాన్స్ దాన్ని అంగీకరించలేదు.
ఇక తేజా గతంలో కూడా మహేష్ అభిమానులతో క్లాష్ అయ్యాడు. 2024 సంక్రాంతి సీజన్‌లో గుంటూరు కారం, హనుమాన్ ఒకే టైంలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఇప్పుడు మళ్లీ ఆయన మాటల వల్ల అదే వాతావరణం రిపీట్ అవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. కొందరు “SSRMB” అనే పదం వాడటం వల్ల సినిమాకు ఎలాంటి నష్టం ఉండకపోవచ్చని చెబుతుంటే, మరికొందరు మాత్రం హీరోలు తమ సినిమాల టైటిల్స్ లేదా ట్యాగ్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఫ్యాన్స్‌కి ఇలాంటి విషయాలు సెన్సిటివ్‌గా ఉంటాయని చెప్పడం మర్చిపోవద్దని వారంటున్నారు. మొత్తానికి, తేజా సజ్జా ప్రమోషన్ సమయంలో చెప్పిన ఈ ఒక్క మాట ఇప్పుడు వివాదానికి దారితీసింది. మిరాయ్ రిలీజ్ దగ్గర్లో ఉండగా ఈ వివాదం హైప్ క్రియేట్ చేసినా, మరోవైపు నెగటివ్ వైబ్ కూడా తెచ్చింది. మరి ఈ వివాదంపై తేజా ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో, పరిస్థితిని కూల్‌గా హ్యాండిల్ చేస్తాడో లేదో చూడాలి.