'జాంబీ రెడ్డి' సీక్వెల్.. ఇంటర్నేషనల్ లెవెల్ లో: తేజ సజ్జా
రీసెంట్ గా హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను దక్కించుకున్నారు. ఇప్పుడు మిరాయ్ తో థియేటర్స్ లోకి వచ్చారు.;
టాలీవుడ్ లో జాంబి జోనర్ లో రూపొందిన చిత్రాలు చాలా తక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే. అందులో మంచి హిట్ అందుకున్న మూవీ జాంబీ రెడ్డి. కోవిడ్ 19పై సెటైరికల్ గా రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఆ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించగా.. టాలెంటెడ్ అండ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తేజ.. పెద్దవాడు అయ్యాక కీలక పాత్రలో బేబీ మూవీలో నటించి సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత హీరోగా జాంబీ రెడ్డి సినిమా చేసి మరో విజయం సొంతం చేసుకున్నారు. రీసెంట్ గా హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను దక్కించుకున్నారు. ఇప్పుడు మిరాయ్ తో థియేటర్స్ లోకి వచ్చారు.
ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ సినిమాతో కూడా మరో హిట్ అందుకునేలా కనిపిస్తున్నారు. అయితే ఆ మూవీ సెట్స్ పై ఉండగానే మిరాయ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తేజతో మరో సినిమాని అనౌన్స్ చేసింది. రాయలసీమ నుంచి ప్రపంచం అంచుల వరకు అంటూ పోస్టర్ పై క్యాప్షన్ ఇచ్చింది. కానీ మూవీ నేమ్ ప్రకటించలేదు.
దర్శకుడి పేరు కూడా చెప్పలేదు. కానీ పోస్టర్ బట్టి అది జాంబీ రెడ్డి మూవీనేని అంతా ఫిక్స్ అయ్యారు. ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ ఇస్తారని.. మరో దర్శకుడు సినిమాను తీయనున్నారని తెలుస్తోంది. దీంతో జాంబీ రెడ్డి సీక్వెల్ పై అందరి ఫోకస్ పడింది. ఇప్పుడు ఆ సినిమా గురించి తేజ సజ్జా చేసి కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జాంబీ రెడ్డి సీక్వెల్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని తేజ సజ్జా తెలిపారు. సినిమా మరో రేంజ్ లో ఉంటుందని అంచనాలు పెంచారు. ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా, ఈసారి అంతర్జాతీయ ప్రేక్షకులకు జాంబీ చిత్రాన్ని అందించాలనుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు మనం ఇంటర్నేషనల్ మూవీ చూస్తున్నామని, ఇప్పుడు ఒకటి మనం కూడా అందించనున్నామని తెలిపారు.
అయితే ఇప్పటికే తెలుగు సినిమా సాంకేతిక ప్రమాణాలు పెరిగాయి. అనేక టాలీవుడ్ బడా సినిమాలు ఇంటర్నేషనల్ లెవెల్ లో అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు జాంబీ రెడ్డి సీక్వెల్ కూడా అదే కోవలోకి వస్తున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో జాంబీ జోనర్ లో రూపొందించిన సినిమాలు విదేశీ సినీ ప్రేక్షకుల దృష్టి ఎప్పుడూ ఆకర్షిస్తాయి. అందుకే జాంబీ రెడ్డి-2 కూడా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.