జీవితంలో ఆ సిచ్యువేషన్.. ఓ సినిమా లాంటిదే: తేజ సజ్జా
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మంచి హిట్లు అందుకుంటున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మంచి హిట్లు అందుకుంటున్న విషయం తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను ఫుల్ గా అలరించిన తేజ, ఇప్పుడు హీరోగా కూడా సందడి చేస్తున్నారు. సూపర్ హిట్స్ అందుకుని బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.
చివరిగా పాన్ ఇండియా ఫిల్మ్ హనుమాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తన క్రేజ్ ను ఓ రేంజ్ లో పెంచుకున్నారు. ఇప్పుడు మిరాయ్ తో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఆ మూవీ.. నిన్న విడుదలై మంచి రెస్పాన్స్ ను అందుకుని దూసుకుపోతోంది.
అయితే సినిమాలో తేజ సజ్జా రెండు కోణాల్లో కనిపించారు. మొదట్లో ఆరంభంలో అల్లరి పనులు చేసే కుర్రాడిగా, తన లక్ష్యం తెలుసుకున్నాక యోధుడిగా రెండు వేరియేషన్స్ లో నటించి మెప్పించారు. యాక్షన్ సీక్వెన్స్ తో ఫిదా చేశారు. దీంతో సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అదే సమయంలో ఆయన ఓ పాడ్ కాస్ట్ లో చేసిన కామెంట్స్ ను కూడా ప్రశంసిస్తున్నారు.
మిరాయ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల పాడ్ కాస్ట్ కు అటెండ్ అయ్యారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దగ్గర ఇబ్బంది పడతాం.. మీరైతే ఏం చేస్తారు అని హోస్ట్ అడగ్గా.. మనమంతా కేవలం ఆనందంగా ఉండడానికి పుట్టలేదమోనని తేజ సజ్జా తెలిపారు. అది మన ఆశయం కాదని, అదొక మొత్తం జీవితంలో అనుభవం మాత్రమేనని చెప్పారు. సినిమాల్లో కూడా అంతేనని తేజ సజ్జా చెప్పుకొచ్చారు.
ఏదైనా మూవీలో కూడా హై పాయింట్ ఉండాలని, ఇంటర్వెల్ ఉండాలని, మిడ్ పాయింట్ ఉండాలని, లో పాయింట్ ఉండాలని, లాస్ట్ మూమెంట్ ఉండాలని, అక్కడి నుంచి రైజ్ అవ్వాలని అన్నారు. అప్పుడే డ్రామా ఎలివేటింగ్ గా ఉంటుందని, ఆల్ లాస్ట్ మూమెంట్ వస్తే కదా.. క్లైమాక్స్ గొప్పగా ఉంటుందని తెలిపారు.
మనం ఆ పాయింట్ లో ఉన్నప్పుడు చాలా బాధగా ఉంటుందని, నిరాశ వ్యక్తం చేస్తామని, 100 ఆలోచిస్తామని చెప్పారు. ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు లేదా కొంత టైమ్ తర్వాత అప్పుడు జరిగింది మన మంచికేనని అనిపిస్తుందని తెలిపారు. అందుకే తానెప్పుడూ ఒక విషయాన్ని నమ్ముతున్నానని, చివరికి అంతా కనెక్ట్ అవుతుందని అన్నారు. ప్రస్తుతం తేజ సజ్జా మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. చాలా బాగా చెప్పారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఫుల్ మెచ్యూరిటీ కామెంట్స్ అని చెబుతున్నారు.