తేజ సజ్జా 'మిరాయ్'.. గట్టి పోటీ తప్పదా?

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు మిరాయ్ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.;

Update: 2025-06-30 09:54 GMT

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు మిరాయ్ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన తేజ.. ఆ తర్వాత లీడ్ రోల్ లో పలు సినిమాల్లో నటించారు. కానీ సరైన ఫేమ్ ను దక్కించుకోలేకపోయారు. హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు.

ఇప్పుడు మిరాయ్ మూవీ చేస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమా తేజ.. సూపర్ యోధగా కనిపించనున్నారు. రితికా హీరోయిన్ గా నటిస్తుండగా.. మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

గౌర హరి మ్యూజిక్ అందిస్తున్న మిరాయ్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అదే సమయంలో ఆడియన్స్ లో భారీ అంచనాలను నెలకొల్పింది. మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మూవీపై అదిరిపోయే బజ్ క్రియేట్ అయింది. దీంతో తేజ సజ్జా ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పక్కాగా చేరుతుందని అంతా భావిస్తున్నారు.

అయితే ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో 2D,3D ఫార్మాట్లలో మిరాయ్.. సెప్టెంబర్ 5వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. నిజానికి.. ఏప్రిల్ లో సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. సెప్టెంబర్ లో విడుదల చేస్తామని తెలిపారు. దీంతో సరైన సోలో రిలీజ్ డేట్ ను సెలెక్ట్ చేసుకున్నారని అంతా అన్నారు.

కానీ ఇప్పుడు అదే రోజు మరో రెండు సినిమాలు రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో నటిస్తున్న కాంత.. సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను టాలీవుడ్ హల్క్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు.

మరోవైపు, అమరన్ తో ఇటీవల సూపర్ హిట్ అందుకున్న కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న మదరాసి కూడా సెప్టెంబర్ 5న రిలీజ్ అవ్వనుంది. మురుగుదాస్ తెరకెక్కిస్తున్న ఆ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో మిరాయ్ కు పెద్ద తలనొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కనుక చిక్కులు తప్పేలా లేవు.

ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో మార్కెట్ పరంగా మిరాయ్ మూవీకి గట్టి పోటీ ఉండేలా కనిపిస్తోంది. అయితే కంటెంట్ ఉంటే.. ఎప్పుడైనా ఎక్కడైనా సక్సెస్ అవ్వవచ్చు. తేజ ఇప్పటికే హనుమాన్ మూవీతో అది ప్రూవ్ చేశారు. మరి ఈ సారి మిరాయ్ తో ఏం చేస్తారో? ఎలాంటి హిట్ అందుకుంటారో? వేచి చూడాలి.

Tags:    

Similar News