నానికి కూడా సాధ్యం కాని రికార్డ్ అందుకున్న తేజ

కానీ హను- మాన్ స్టార్ తేజ సజ్జా ఎమర్జింగ్ స్టార్ గా ఎదుగుతున్నారు. ఈ క్రమంలో అతను నాని, విజయ్ దేవరకొండ కంటే ఎక్కువగా టార్గెట్ పెట్టుకున్నాడు.;

Update: 2025-09-13 10:30 GMT

టాలీవుడ్ లో బడాస్టార్స్ ను పక్కన పెడితే, క్రేజ్, ఓపెనింగ్స్, బిజినెస్, బాక్సాఫీస్ మైలురాళ్ల పరంగా నేచురల్ స్టార్ నాని, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ టైర్ 2 హీరోలలో టాప్ లో ఉన్నారు. కానీ హను- మాన్ స్టార్ తేజ సజ్జా ఎమర్జింగ్ స్టార్ గా ఎదుగుతున్నారు. ఈ క్రమంలో అతను నాని, విజయ్ దేవరకొండ కంటే ఎక్కువగా టార్గెట్ పెట్టుకున్నాడు.

హను- మాన్ ఒకప్పటి సూపర్ హిట్ అని, ఆ తర్వాత తేజ అంత పెద్ద హిట్స్ ను హ్యాండిల్ చేయలేడని విశ్లేషణలు ఉన్నాయి. కానీ అతను తన తాజా చిత్రం మిరాయ్ సెన్సేషనల్ బిజినెస్, ఓపెనింగ్స్ తో తో విశ్లేషకుల అంచనాలు తప్పు అని నిరూపించాడు. ఈ సినిమాల ఫలితాలతో తనను తాను స్టార్ గా నిరూపించుకున్నాడు. సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న మిరాయ్.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 100 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదే గనుక జరిగితే, తేజ సజ్జా ఈ మైలురాయిని సాధించిన మొదటి టైర్ 2 హీరో అవుతాడు. ఎందుకంటే నాని, విజయ్ దేవరకొండ లేదా మరే ఇతర టైర్ 2 స్టార్ కూడా ఈ మైలురాయిని సాధించలేదు. మిరాయ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వీకెండ్ లో , అన్ని ప్రాంతాల్లో 2వ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెనింగ్ డే కంటే 30% ఎక్కువగా ఉన్నాయి.

కాగా, కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ ఫాంటసీ సినిమా సెప్టెంబర్ 12న రిలీజైంది. గతంలోనే టీజర్ తో మేకర్స్ సినిమాపై అంచనాలు పెంచేశారు. దీంతో తెలుగు ప్రేక్షకులు అంతా ఇది ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తూ వచ్చారు. ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ సూపర్ యోధా జానర్ లో తెరకెక్కింది. ఇందులో తేజ సజ్జా హీరోగా నటించగా.. మంచు విష్ణు నెగెటివ్ రోల్ లో కనిపించారు. రితికా నాయక్, శ్రేయా శరణ్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

భారీ అంచనాలు నడుమ విడుదలైన సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తొలి రోజే ఈ సినిమా రూ. 27.20 కోట్ల వసూల్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. అటు ఓవర్సీస్ లోనూ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Tags:    

Similar News