ఇండియన్ సూపర్ హీరోస్ అందరినీ కలిపితే.. తేజ సజ్జ ప్లాన్ అదుర్స్..!

తేజ సజ్జ.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో ఇంపాక్ట్ చూపిస్తున్న యాక్టర్ అతను. తనకు వచ్చిన ఛాన్స్ ని పర్ఫెక్ట్ గా యుటిలైజ్ చేసుకుంటూ తేజ సజ్జ అదరగొట్టేస్తున్నాడు.;

Update: 2025-09-10 09:41 GMT

తేజ సజ్జ.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో ఇంపాక్ట్ చూపిస్తున్న యాక్టర్ అతను. తనకు వచ్చిన ఛాన్స్ ని పర్ఫెక్ట్ గా యుటిలైజ్ చేసుకుంటూ తేజ సజ్జ అదరగొట్టేస్తున్నాడు. హనుమాన్ హిట్ తర్వాత తేజ సజ్జ మిరాయ్ తో వస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి.

సూపర్ హిట్ కొట్టిన లోక చాప్టర్ 1..

ఐతే తేజ సజ్జ మిరాయ్ ప్రమోషన్స్ లో ఈమధ్యనే మలయాళంలో రిలీజై సూపర్ హిట్ కొట్టిన లోక చాప్టర్ 1 చంద్ర సినిమా టీం ని అభినందించాడు. అంతేకాదు తనకు వచ్చిన ఒక క్రేజీ ఐడియాని బయట పెట్టాడు తేజ సజ్జ. మిరాయ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో లోక, హనుమాన్, మిన్నల్ మురళి, వేద అదే మిరాయ్ లో తేజ సజ్జ వీళ్లంతా కలిసి ఇండియన్ అవెంజర్స్ లా మారితే ఎలా ఉంటుందని అంటున్నాడు.

ఈ పాత్రలన్నీ సినీ ప్రియులను అలరించాయి కాబట్టి వాటిని కొనసాగిస్తే బెటర్ అని అంటున్నారు. అంటే ఇండియన్ అవెంజర్స్ గా వేద, లోక, మిన్నల్ మురళి, హనుమాన్ ఇలా ప్రతి ఒక కథ చెప్పాలని అంటున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే ఇదొక అద్భుతమైన ఆలోచన అని చెప్పొచ్చు. ఇండియన్ సూపర్ హీరో సినిమాలన్నీ కూడా ఒకే దగ్గరకు తెచ్చి ఇండియన్ అవెంజర్స్ గా తీస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.

హనుమాన్ సక్సెస్ తో మార్కెట్ వైడ్..

ఐతే అలా చేయడం అంత సామాన్యమైన విషయం కాదు కానీ తేజ సజ్జ చెప్పిన ఐడియా మాత్రం ఇంప్రెస్ చేస్తుంది. హనుమాన్, మిరాయ్ ఇలా సూపర్ హీరో సినిమాలతోనే తేజా సజ్జ సత్తా చాటుతున్నాడు. కుర్రాడి ప్లాన్ చూస్తుంటే ఇలాంటి కథలనే మళ్లీ మళ్లీ చేసేలా ఉన్నాడు. హనుమాన్ సక్సెస్ తో మార్కెట్ వైడ్ కూడా తేజ అదృష్టం బాగుందని చెప్పొచ్చు. తేజా సజ్జ ఓ బేబీ తర్వాత జాంబి రెడ్డి చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో హనుమాన్ చేశాడు. ప్రశాంత్ వర్మ తో తేజ ర్యాంపో బాగా కుదిరింది. అందుకే సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. మిరాయ్ కూడా అదే రేంజ్ సక్సెస్ అందుకుంటుంది.

మిరాయ్ సినిమా విజువల్స్ భారీగా ఉన్నా బడ్జెట్ కూడా మరీ అంత ఎక్కువ కాలేదని తెలుస్తుంది. ఎందుకంటే స్టార్ రెమ్యూనరేషన్ లు గట్రా పెద్దగా లేదు కాబట్టి తక్కువలో కానిచ్చారు. ఐతే తేజ సజ్జ ఈ సినిమా మీద చాలా పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడు.

Tags:    

Similar News