తేజ సజ్జా.. సీక్వెల్స్ తో వేరే స్థాయికి చేరనున్నాడా?
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా గురించి అందరికీ తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తేజ.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.;
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా గురించి అందరికీ తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తేజ.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించారు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు హీరోగా ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు. వరుస హిట్స్ అందుకుంటున్నారు.
హిట్స్ మాత్రమే కాదు.. బ్యాక్ టు బ్యాక్ హనుమాన్, మిరాయ్ చిత్రాలతో రూ.100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టారు. గత సంవత్సరం హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తేజ.. ఇప్పుడు మిరాయ్ తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ రెండు చిత్రాలతో ఓవర్సీస్ లో 2.5 మిలియన్ డాలర్స్ మార్క్ ను కూడా టచ్ చేశారు.
బడా హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్ సరసన నిలిచి ఔరా అనిపించారు. దీంతో తేజ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. అందరి దృష్టిని ఆకర్షించారు. మిరాయ్ విజయంతో టాలీవుడ్ లో మిడ్ రేంజ్ టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. తన అప్ కమింగ్ ప్రాజక్టులపై ఫోకస్ పడేలా చేశారు. అయితే తేజ సూపర్ ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
కెరీర్ లో మరింత ఎదిగేందుకు సరైన విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన లైనప్ లో మూడు సీక్వెల్స్ ఉండటం గమనార్హం. రీ ఎంట్రీ లో జాంబీ రెడ్డితో మంచి విజయం అందుకున్న తేజ.. ఆ సినిమా సీక్వెల్ చేయనున్నారు. హనుమాన్, మిరాయ్ సీక్వెల్స్ లో కూడా యాక్ట్ చేయనున్నారు.
అయితే జాంబీ రెడ్డి సీక్వెల్ ను మిరాయ్ మేకర్స్ నిర్మించనున్నారు. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. త్వరలో షూటింగ్ మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం కథపై ఫోకస్ పెట్టారని సమాచారం. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
ఆ రెండు అయ్యాక మిరాయ్ సీక్వెల్ మిరాయ్: జైత్రయ చేయనున్నారని తెలుస్తోంది. మొత్తానికి మూడు సీక్వెల్స్ తో వరుసగా తేజ సందడి చేయనున్నారని అర్థమవుతోంది. ఆ మూడింటిపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అవన్నీ వర్కౌట్ అయితే మాత్రం తేజకు తిరుగలేదు. కెరీర్ లో మరో స్థాయికి చేరనున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.