స్టార్ హీరోలతో సినిమాలు.. తేజ సజ్జా ఏమన్నాడంటే?
టాలీవుడ్‌లో యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు తేజ సజ్జా. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన ఈ యువ హీరో, ఇప్పుడు హనుమాన్ బ్లాక్‌బస్టర్ తర్వాత భారీ పాన్ ఇండియా రేంజ్‌లోకి అడుగుపెట్టాడు.;
టాలీవుడ్‌లో యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు తేజ సజ్జా. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన ఈ యువ హీరో, ఇప్పుడు హనుమాన్ బ్లాక్‌బస్టర్ తర్వాత భారీ పాన్ ఇండియా రేంజ్‌లోకి అడుగుపెట్టాడు. త్వరలోనే విడుదల కానున్న మిరాయ్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా కోసం కూడా చాలా వర్క్ చేసి, కొత్త తరహా కాన్సెప్ట్‌తో విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వబోతున్నాడు.
ఒక ఇంటర్వ్యూలో తేజా సజ్జా ఇతర స్టార్స్ తో నటించాలని ఉందని తన కోరికను బయటపెట్టాడు. చిరంజీవి, వెంకటేష్ వంటి సీనియర్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడట. ముఖ్యంగా కామెడీ సీన్లలో వారితో కలిసి నటించడం తన డ్రీమ్ అని చెప్పాడు. కామెడీ జానర్‌పై తనకెంతో ఇష్టం ఉండటమే కాకుండా, అలాంటి సన్నివేశాల్లో నటించడం ఒక వేరే అనుభూతి అవుతుందని అభిప్రాయపడ్డాడు.
"చిరంజీవి గారి కామెడీ టైమింగ్‌కి సాటిలేదు. వెంకీ గారి ఎక్స్‌ప్రెషన్స్, హ్యూమర్ సెన్స్ ఎప్పుడూ అల్టిమేట్‌గా ఉంటాయి. ఈ ఇద్దరితో ఒక యంగ్ హీరో పాత్రలో నేను ఉంటే.. ఆ స్క్రీన్‌ప్లే ఎలా ఉంటుందో అనిపిస్తుంది. వాళ్లతో చేసే అవకాశమే వస్తే అదే నాకు పెద్ద గౌరవం" అంటూ తేజా సజ్జా తన మనసులోని మాట బయటపెట్టాడు.
చిరంజీవి సినిమాల్లో ఈమధ్య మరో హీరోలకు కూడా స్పెషల్ స్కోప్ వస్తోంది. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాల్లో ఇతర హీరోలకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక వెంకటేష్ అయితే మల్టీస్టారర్స్‌కు ఎప్పుడూ రెడీగా ఉంటారు. కాబట్టి తేజా సజ్జా కోరిక నెరవేరొచ్చని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ “సీనియర్ హీరోలందరితో నేను చిన్నప్పుడు సినిమాలు చేశాను. ఇప్పుడు మళ్లీ ఒక యంగ్ హీరోగా వాళ్లతో స్క్రీన్ పంచుకోవడం ఒక పెద్ద గౌరవం అవుతుంది. కామెడీ సీన్స్ అయినా, పాటలు అయినా.. నాకు లైఫ్‌టైమ్ మెమరీస్ గా మిగిలిపోతాయి” అని చెప్పుకొచ్చాడు. ఇక రాబోయే సినిమా మిరాయ్ గురించి మాట్లాడుతూ "ఈ సినిమాలో ఎలాంటి బాడీ డబుల్స్ వాడలేదు. రిస్క్ ఉన్న సన్నివేశాలు కూడా నేను స్వయంగా చేశాను. ఆ యాక్షన్ ఎలిమెంట్స్ ఆడియన్స్‌కి ఫ్రెష్ అనుభూతి ఇస్తాయి. సినిమా రిలీజ్ కోసం చాలా ఎక్సైట్ గా ఎదురుచూస్తున్నాను" అని తెలిపాడు.