అదే గ్యాంగ్ ఆమెనీ టార్గెట్ చేసిందా!

ఎదిగే వాడిని కింద‌కు లాగే ప్ర‌యత్నాలు చేయ‌న‌ది ఎవ‌రు? చేయ‌క‌పోతే ఆశ్చ‌ర్య‌పోవాలి గానీ చేస్తే ఆశ్చర్యం దేనికి? ప‌నిగ‌ట్టుకుని మ‌రి కొన్ని గ్యాంగ్ లు అదే ప‌నిలో ఉంటాయి.;

Update: 2025-08-15 05:16 GMT

ఎదిగే వాడిని కింద‌కు లాగే ప్ర‌యత్నాలు చేయ‌న‌ది ఎవ‌రు? చేయ‌క‌పోతే ఆశ్చ‌ర్య‌పోవాలి గానీ చేస్తే ఆశ్చర్యం దేనికి? ప‌నిగ‌ట్టుకుని మ‌రి కొన్ని గ్యాంగ్ లు అదే ప‌నిలో ఉంటాయి. ఇలాంటి కుతంత‌త్రాలు అన్ని రంగాల్లో ఉన్న‌వే. సినిమా రంగంలో ఇంకాస్త ఎక్కువ‌గా ఉంటుంది. ఇండ‌స్ట్రీలో ఎదిగే వాళ్ల‌ను తొక్కే ప్ర‌య త్నాలు అప్పుడ‌ప్పుడు తెర‌పైకి వ‌స్తుంటాయి. ఆ మ‌ధ్య యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వరం విష‌యంలోనూ ఇది క‌నిపించింది. త‌న‌ను కావాల‌నే టార్గెట్ చేసి వేదిస్తున్నార‌ని...ఇండ‌స్ట్రీకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చిన వాడిని కావ‌డంతో? ఈజీగా టార్గెట్ అవుతున్నానంటూ ఆవేద‌న చెందాడు.

అలాంటి వాళ్ల‌ను ప‌ట్టించుకోవాల్సిన ప‌నిలేదు:

కూలి ప‌నుల నుంచి స్టార్ గా ఎదిగిన వాడిన‌ని... సినిమా అవ‌కాశాలు లేక‌పోతే మ‌ళ్లీ అదే ప‌ని చేయ‌డానికి తానెంత మాత్రం సిగ్గు ప‌డ‌న‌ని ప‌బ్లిక్ గానే చెప్పాడు. త‌న‌తో ఏదైనా స‌మ‌స్య ఉంటే నేరుగా త‌న ముందు కొచ్చే మాట్లాడి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవచ్చ‌ని ఆ గ్యాంగ్ కి సూచ‌న కూడా జారీ చేసాడు. ఆస‌మయంలో యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కూడా కిర‌ణ్ అబ్బ‌వ‌రంకు బాస‌ట‌గా నిలిచారు. కిర‌ణ్ ఎప్పుడో ఆ స్థాయి దాటిపోయి వ‌చ్చేసాడ‌ని...అలాంటి వాళ్ల‌ను చూసి భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని...ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం అంత‌క‌న్నా లేద‌ని భ‌ర‌సో క‌ల్పించారు.

పాపుల‌ర్ అవుతోన్న స‌మ‌యంలో:

కిర‌ణ్ ప‌డిన క‌ష్టం త‌న‌కు ఎంత మాత్రం తెలియ‌ద‌ని...అలాంటి వారు ఇండ‌స్ట్రీకి మ‌రింత మంది రావాలని చైత‌న్య కోరారు. ఈ సంఘ‌ట‌న జ‌ర‌గ‌డానికి ముందే మ‌రో యంగ్ హీరో విష‌యంలో కూడా ఇలాంటి వివా ద‌మే తెర‌పైకి వ‌చ్చింది. అప్ప‌టికే ఆ హీరో రెండు..మూడు సినిమాలు చేసాడు. హీరోగా ఎస్టాబ్లిష్ అవుతోన్న స‌మ‌య‌మ‌ది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఆ హీరో సినిమాను ఓ గ్యాంగ్ టార్గెట్ చేసి నెట్టింట లీక్ చేసే ప్రయ‌త్నం చేసింది. అయినా కూడా థియేట్రిక‌ల్ రిలీజ్ అనంత‌రం మంచి రెస్పాన్స్ రావ‌డంతో లాభా లొచ్చాయి.

ఎదిగే వాళ్ల‌ను కింద‌కు లాగ‌డం:

ఆ స‌మ‌యంలోనే ఓ అగ్ర నిర్మాత కూడా ఆ హీరోకు అండ‌గా నిల‌బడ్డారు. ఆ హీరోని ట‌చ్ చేయాలంటే ముందు త‌న‌ని దాట‌ని ఆ గ్యాంగ్ కి పెద్ద వార్నింగే ఇచ్చారు. ఆ దెబ్బ‌తో ఆ హీరోపై మ‌ళ్లీ అలాంటి ప్ర‌య త్నాల‌కు ఎవ‌రూ పూనుకోలేదు. తాజాగా ఓ ఫేమ‌స్ న‌టి కూడా ఇలా టార్గెట్ అయిన‌ట్లు ఆమె చేసిన వ్యా ఖ్య‌ల్ని బ‌ట్టి అర్ద‌మ‌వుతోంది. ఇండ‌స్ట్రీలో త‌న‌ని తొక్కే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయని, త‌న‌ని కావాల‌నే ట్రోలింగ్ చేస్తున్నార‌ని వాపోయింది.

ఫిలిం స‌ర్కిల్స్ లోనూ చ‌ర్చే:

ఇలా జ‌ర‌గ‌డం తొలిసారి కాద‌ని...న‌టిగా గుర్తింపు వ‌చ్చిన ద‌శ నుంచి ఈ ర‌క‌మైన ప‌రిస్థితిని ఎదుర్కుం టున్న‌ట్లు చెప్పుకొచ్చింది. కొంత మంది డ‌బ్బులిచ్చి మ‌రీ నెగిటివ్ ప్ర‌చారం చేయిస్తున్నార‌ని ఆరో పించింది. గ‌తంలో ఇలాంటి ప‌రిస్థితి ఎదుర్కున్న న‌టుడికి ఆమె క్లోజ్ కావ‌డం కూడా ఈ ర‌క‌మైన ప‌రి స్థితుల్లోకి నెట్టిందా? అన్న అనుమానాన్ని కూడా వ్య‌క్తం చేసింది. వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఉన్న బాండింగ్ కార‌ణంగానే న‌టిని కూడా ఇలా టార్గెట్ చేస్తున్నారా? అన్న చ‌ర్చ ఫిలిం స‌ర్కిల్స్ లోనూ జోరుగా సాగుతోంది.

Tags:    

Similar News