బాలీవుడ్ నుంచి నెక్స్ట్ దిగే హీరో ఎవరు?
తారక్-హృతిక్ రోషన్ ని ఒకే వేదికపై అభిమానులు చూసుకోవడం అన్నది ఎంతో అరుదైన సంఘటన.;
తారక్-హృతిక్ రోషన్ ని ఒకే వేదికపై అభిమానులు చూసుకోవడం అన్నది ఎంతో అరుదైన సంఘటన. ఆ ద్వయాన్ని వేదికపై చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు. భాషలు వేరైనా..ప్రాంతాలు వేరైనా? ఇద్దరు అన్నద మ్ముల్లా వ్యవరించిన తీరుకు తెలుగు జనం ఫిదా అయ్యారు. ఓ సీనియర్ గా తారక్ హృతిక్ ని గౌర వించడం ....తనకన్నా జూనియర్ అయినా తారక్ పట్ల అంతే గౌరవాన్ని హృతిక్ పంచుకోవడం ఇలాంటి సంగతులతో ప్రీ రిలీజ్ ఎంతో గొప్ప వేదికగా మారింది. ఇది ఏమాత్రం ఊహించని కాంబినేషన్ .
ఇద్దరు కలిసి సినిమా చేస్తారని తారక్ అభిమాని ఎవరూ అనుకుని ఉండరు. కొన్ని కొన్ని కాంబినేషన్లను కాలం అనుకోకుండా కలుపుతుంది. అవి అంతే అద్భుతంగానూ వర్కౌట్ అవుతుంటాయి. సల్మాన్ ఖాన్-చిరంజీవి `ఆచార్య` కోసం పని చేయడం అటుపై చిరంజీవి-నాగార్జున-అమీర్ ఖాన్ ఒకే వేదికను పంచు కోవడం ఇవన్నీ కాకతాళీయమే. ఆ తర్వాత వారంతా గొప్ప స్నేహితులుగా మారడం టాలీవుడ్-బాలీవుడ్ మధ్య మైత్రిని మరింత బలపరిచింది. తారక్-హృతిక్ తాజా సినిమా బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది.
ఈ నేపథ్యంలో తదుపరి టాలీవుడ్ హీరోతో కలిసి పనిచేసే బాలీవుడ్ హీరో ఎవరు? అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. టాలీవుడ్ టాప్ హీరోలు మహేష్, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్ ఇలా కొంత మంది హీరోలున్నారు. వీళ్లకు సమ ఉజ్జీగా బాలీవుడ్ లో చాలా మంది హీరోలున్నారు. సీనియర్ హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఉన్నారు. టాలీవుడ్ లో మంచి ఛాన్స్ రావాలేగానీ నటించడానికి రెడీగా ఉన్న స్టార్లే.
తర్వాత జనరేషన్ బాలీవుడ్ హీరోలైతే డజన్ల కొద్ది ఉన్నారు. వారంతా తెలుగు సినిమాలో భాగమవ్వాలని ఎంతో ఆసక్తిగా ఉన్నారు. పాన్ ఇండియాలో సక్సస్ అయిన తెలుగు దర్శకులతో పని చేయాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. సౌత్ లో మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడం కోస వారంతా తెలుగు హీరోలతో పని చేయడానికి సిద్దంగా ఉన్నా రు. వారితో మమేకం అవ్వడానికి టాలీవుడ్ హీరోలు సంసిద్దంగానే ఉన్నారు. మరి ఎవరు ఎలా జోడీ అవుతారు? అన్నది విధి నిర్ణయించాలి.