ఆడ్రి హెప్బర్న్ స్టైల్ రిమైండ్.. తారా సుతారియా లుక్ వైరల్!
యశ్ సరసన నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'టాక్సిక్' గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న వేళ, బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది.
యశ్ సరసన నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'టాక్సిక్' గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న వేళ, బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. క్లాసిక్ గ్రాండ్ పియానో పక్కన నిలబడి ఆకర్షణీయమైన పోజులిచ్చిన ఈ పిక్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. "1950ల కాలంలోనే చిక్కుకుపోయాను (ఎప్పటికీ బయటకు రాను)" అనే డిఫరెంట్ క్యాప్షన్‌తో ఆమె పోస్ట్ చేసిన ఈ రెట్రో పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
పాత హాలీవుడ్ శైలిలో కన్నులవిందు:
ఈ సరికొత్త ఫోటోషూట్‌లో తారా సుతారియా నలుపు రంగు లేస్ గౌన్‌లో అత్యంత రాయల్ లుక్‌లో దర్శనమిచ్చారు. ఈ రాయల్ అటైర్‌కు తోడు మెడలో ముత్యాల చోకర్, దానికి సరిపోయే ఇయర్ రింగ్స్ ధరించి మరింత ఎలిగెంట్‌గా మెరిసిపోయారు. ఇక ఆమె హెయిర్ స్టైల్, గ్లామరస్ పోజులు అప్పట్లో హాలీవుడ్ లెజెండరీ నటి 'ఆడ్రి హెప్బర్న్' క్రియేట్ చేసిన ఐకానిక్ రెట్రో వైబ్‌ను, ఓల్డ్ హాలీవుడ్ గ్లామర్‌ను గుర్తుచేస్తున్నాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
పియానో పక్కన రాయల్ పోజులు:
ఫోటోలలో పియానో పక్కన నిలబడి తారా ఇచ్చిన పోజులు వింటేజ్ క్లాస్ లుక్‌కు పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలిచాయి. ఇక పాతకాలపు క్లాసిక్ వాతావరణాన్ని తలపించేలా తీర్చిదిద్దిన ఈ పిక్స్, ఆమెలోని రాయల్ ఫ్యాషన్ సెన్స్‌ను ఎలివేట్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది సమయాలోనే లక్షలాది లైకులు, కామెంట్లతో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
'టాక్సిక్' ప్రాజెక్ట్‌తో బిజీ బిజీగా తారా:
ఈ ఏడాది అత్యంత భారీ అంచనాలతో రాబోతున్న సినిమాల్లో 'టాక్సిక్' ఒకటి. ఒకవైపు వెండితెరపై భారీ ప్రాజెక్ట్‌లతో అలరించేందుకు సిద్ధమవుతూనే, మరోవైపు తన ఫ్యాషన్ గేమ్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఈ భామ. కేవలం నటిగానే కాకుండా, ఇండస్ట్రీలో ఒక ఐకానిక్ ఫ్యాషన్ దివాగా కూడా తారా సుతారియా తన ప్రత్యేక ముద్రను వేస్తోంది.
స్టైల్, ఎలిగెన్స్, గ్లామర్ కలబోతగా నిలిచిన తారా సుతారియా లేటెస్ట్ ఫోటోషూట్ నెటిజన్లకు వింటేజ్ పండగను అందిస్తోంది. ఇక 1950ల నాటి హాలీవుడ్ వైబ్‌ను రీక్రియేట్ చేస్తూ ఆమె ఇచ్చిన పోజులు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. నటనలోనే కాక ఫ్యాషన్ విషయంలోనూ తనకు సాటిలేరని తారా సుతారియా ఈ రాయల్ పోర్ట్రెట్లతో మరోసారి నిరూపించారు.