కాబోయే వ‌రుడిపై త‌మ‌న్నా ప్యాకేజీ

సౌతిండియాలో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న‌ తమన్నా భాటియా పెళ్లితో జీవితంలో స్థిర‌ప‌డేందుకు సిద్ధ‌మైంద‌ని క‌థ‌నాలొచ్చాయి.;

Update: 2025-09-12 04:06 GMT

సౌతిండియాలో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న‌ తమన్నా భాటియా పెళ్లితో జీవితంలో స్థిర‌ప‌డేందుకు సిద్ధ‌మైంద‌ని క‌థ‌నాలొచ్చాయి. న‌టుడు విజ‌య్ వ‌ర్మ‌తో డేటింగ్ స‌మ‌యంలో ఇక పెళ్లితో ఒక‌ట‌వుతున్నార‌ని కూడా ప్ర‌చార‌మైంది. కానీ ఇంత‌లోనే ఊహించ‌ని మ‌లుపులు.. విజ‌య్ వ‌ర్మ‌తో బ్రేక‌ప్ ఊహించ‌ని షాక్. అయినా జీవితంలో ఇలాంటి విధి చాలా స‌హ‌జ‌మ‌ని త‌మ‌న్నా న‌మ్ముతోంది.

అయితే త‌మ‌న్నా ఇక పెళ్లి చేసుకోదా? స్నేహితుడే భాగ‌స్వామి అయితే? ఈ రెండు ప్ర‌శ్న‌ల‌కు తాజా కార్య‌క్ర‌మంలో జ‌వాబు ఇచ్చింది త‌మ‌న్నా. ప్ర‌స్తుతం జీవిత భాగ‌స్వామి గురించి త‌మ‌న్నా ఇంకా ఆలోచిస్తోందిట‌. అమెజాన్ ప్రైమ్ వీడియో షో `డూ యు వాన్నా పార్టనర్` కార్య‌క్రమంలో హోస్ట్ డయానా పెంటీతో మాట్లాడుతూ తాను ఎలాంటి జీవిత భాగ‌స్వామిగా ఉండాల‌నుకుంటుందో వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం జీవిత భాగ‌స్వామి కోసం వెతుకుతున్నా.. నేను గొప్ప జీవిత భాగస్వామిగా మారడానికి ప్రయత్నిస్తున్నానని అంతి. ``ఎవరైనా గత జీవితంలో మంచి కర్మ చేసిన భాగస్వామిగా ఉండాలనుకుంటున్నాను.. ఆ అదృష్ట‌వంతుడి కోసం త్వ‌ర‌లో ప్యాకేజీ ఏమిటో చెబుతాను`` అని త‌మ‌న్నా వ్యాఖ్యానించింది.

ఇద్ద‌రు ప్రాణ స్నేహితులు క‌లిసి వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందో మాట్లాడే వేదిక -డూ యు వాన్నా పార్టనర్. ఇదే టాపిక్ పై ప్ర‌శ్నించ‌గా.. త‌మ‌న్నా ఎప్ప‌టికీ త‌న ప్రాణ స్నేహితుల‌తో వ్యాపారం చేయ‌లేని ప‌రిస్థితి ఉంద‌ని అన్నారు. త‌న మేక‌ప్ ఉమెన్ బిల్లీ మంచి స్నేహితురాలు. త‌న‌ను ఒప్పించేందుకు ప్ర‌య‌త్నించినా త‌న‌తో వ్యాపారం చేయ‌లేనిని బిల్లీ స్ప‌ష్ఠంగా చెప్పిందట‌. ప‌రిశ్ర‌మ నుంచి ప్ర‌గ్య జైశ్వాల్ ప్రాణ స్నేహితురాలు. మేం క‌లిసిన‌ప్పుడు ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతామ‌ని, ఒక‌సారి తాను సెట్లో ఉండ‌గా త‌న‌తో క‌నీసం 20 ని.లు అయినా గ‌డ‌పాల‌ని వ‌చ్చార‌ని అది త‌న‌ను చాలా మార్చేసింద‌ని త‌మ‌న్నా వెల్ల‌డించింది. షూటింగ్ స‌మ‌యంలో ఎవ‌రితోను గ‌డిపే అవ‌కాశం ఉండ‌దు..అయినా త‌న స్నేహితులు త‌న కోసం వేచి చూసార‌ని కూడా త‌మ‌న్నా వ్యాఖ్యానించింది. ప్రాణ స్నేహితుల‌తో వ్యాపార భాగ‌స్వామి అవ్వ‌డం బావుంటుంది.. కానీ వ్యాపారం చేయ‌డానికి ఎవ‌రినీ ఒప్పించ‌లేక‌పోయాన‌ని త‌మ‌న్నా వెల్ల‌డించారు. స్నేహం ఎప్పుడూ అహం లేకుండా ప‌రిమిత ఖ‌ర్చుతో ముందుకు సాగేదిగా ఉండాల‌ని డ‌యానా పెంటీ వ్యాఖ్యానించారు.

త‌మ‌న్నా కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ప్ర‌స్ఉతం రేంజర్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. అజ‌య్ దేవ‌గ‌న్ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడు. రోమియో అనే చిత్రంలోను న‌టిస్తోంది. రోహిత్ శెట్టితో ఓ సినిమాకి క‌మిటైంది. వి-వాన్ ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ అనే చిత్రంలోను త‌మ‌న్నా న‌టిస్తోంది.

Tags:    

Similar News