ఫిట్‌నెస్ కోసం తపన.. జిమ్ వదిలిపెట్టని నటి!
తమన్నా భాటియా.. రెండు దశాబ్ధాల కెరీర్ జర్నీలో ఏనాడూ అలసట అన్నదే దరి చేరనివ్వని స్టార్. ఫిట్నెస్ పరంగా తగ్గేదే లేదు.;
తమన్నా భాటియా.. రెండు దశాబ్ధాల కెరీర్ జర్నీలో ఏనాడూ అలసట అన్నదే దరి చేరనివ్వని స్టార్. ఫిట్నెస్ పరంగా తగ్గేదే లేదు. బరువు పెరిగిన ప్రతిసారీ తక్కువ సమయంలో తిరిగి తన రూపాన్ని టోన్డ్ డౌన్ చేస్తుంది. ఇటీవల విజయ్ వర్మతో ప్రేమలో వైఫల్యం తర్వాత కొంత బరువు పెరిగినట్టే కనిపించిన తమన్నా, ఇంతలోనే ఫుల్ స్లిమ్ గా మారిపోయి కనిపించింది.
తమన్నా ఆకస్మిక మేకోవర్ నిజంగా ఆశ్చర్యపరిచింది. దీనికోసం నిరంతరం జిమ్ లో శ్రమిస్తూ అవసరమైన ఆహార నియమాలను పాటించానని చెప్పింది తమన్నా. చాలా శ్రమిస్తే, చమటోడిస్తేనే ఈ స్థాయి మేకోవర్ సాధ్యం. నిజానికి తమన్నా మునుపటి కంటే ఛామింగ్‌గా కనిపిస్తోంది. టోన్డ్ ఫిజిక్ తో మైమరిపిస్తోంది. వయసు సుమారుగా 40కి చేరువవుతున్నా తమన్నా మునుపటి కంటే చామ్ తో మెరిసిపోతోంది. ఇదంతా జిమ్ లో క్రమం తప్పకుండా చేసే కసరత్తులతోనే సాధ్యం.
జిమ్‌లో డంబెల్ ఎత్తుతూ ఉన్నప్పటి కొన్ని దృశ్యాలను తమన్నా సోషల్ మీడియాల్లో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. 90 నిమిషాల తీవ్రమైన డ్యాన్స్ రిహార్సల్ తర్వాత కూడా మళ్లీ జిమ్ లో శ్రమించే ఈ బ్యూటీ ప్రయత్నం నిజంగా మెచ్చదగినది. తమన్నా కోచ్ ముస్తఫా అహ్మద్ ఈ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసారు. ఒక సాధారణ బూడిద రంగు స్పోర్ట్ డ్రెస్ ధరించి జిమ్ లో తక్కువ వెయిట్స్‌తో తమన్నా కసరత్తులు చేస్తోంది. సంవత్సరాలుగా ఎంతో గొప్ప క్రమశిక్షణ.. ఓర్పు సహనం, సమతుల్యతను పాటించే నటిగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ట్రెండ్స్ ను వెంబడించదు..కేలరీలను లెక్కించదు..కేవలం పురోగతిని వెంటాడుతుంది. ఎప్పటికీ అలసిపోనంత ఎనర్జీ తన సొంతం. ఫిట్ గా, యూనిక్ గా కనిపించేందుకు తపన తనను ఈ స్థానంలో నిలబెట్టాయి. కెరీర్ లో ఏం సాధించింది? అన్నది అప్రస్తుతం. ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడిన మేటి కథానాయికల్లో ఒకరిగా తమన్నా పేరు సుస్థిరమైంది.
తమన్నా కెరీర్ మ్యాటర్‌కి వస్తే... ప్రస్తుతం `రేంజర్` చిత్రీకరణ దశలో ఉంది. అజయ్ దేవగన్ ఈ చిత్రంలో కథానాయకుడు. `రోమియో` అనే చిత్రంతో పాటు, వి-వాన్ ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ అనే చిత్రంలోను తమన్నా నటిస్తోంది. రోహిత్ శెట్టితో ఓ సినిమాకి కమిటైంది.