15 ఏళ్ల నుండి కెమెరా ముందే.. ఇంజక్షన్స్ రూమర్ పై క్లారిటీ!
ఫిలిం ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు సొంతం చేసుకుని అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ దక్కించుకుంది తమన్నా భాటియా.;
ఫిలిం ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు సొంతం చేసుకుని అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ దక్కించుకుంది తమన్నా భాటియా. శ్రీ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. హ్యాపీడేస్ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ప్రభాస్, రామ్ చరణ్ , అల్లు అర్జున్, నాగచైతన్య వంటి హీరోలతో కలిసి నటించడమే కాకుండా చిరంజీవి వంటి సీనియర్ హీరోలతో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా రెండు తరాల హీరోలతో స్క్రీన్ పంచుకున్న హీరోయిన్స్ జాబితాలో ఒకరిగా పేరు సొంతం చేసుకుంది తమన్నా.
ఇదిలా ఉండగా సడన్గా బరువు పెరిగిపోయి మళ్లీ బరువు తగ్గడంతో ఈమెపై కొన్ని రకాల రూమర్స్ స్ప్రెడ్ అయిన విషయం తెలిసిందే. అందంగా, స్లిమ్ముగా కనిపించడం కోసం గత కొన్ని సంవత్సరాలుగా తమన్న ఇంజక్షన్ వాడుతోంది అంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వైరల్ అయ్యాయి. దీనికి తోడు తన ప్రియుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నప్పుడు ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టని ఈమె... సడన్ గా లవ్ లో బ్రేకప్ అయిన తర్వాత మళ్లీ కెరియర్ పై ఫోకస్ పెట్టడానికి జిమ్ లో తెగ కష్టపడుతూ ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమన్నా స్పందిస్తూ రూమర్స్ కి ఒక్క మాటతో చెక్ పెట్టింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా మాట్లాడుతూ.." 15 ఏళ్ల నుండి నేను కెమెరా ముందే నటిస్తూ ఉన్నాను. నా లైఫ్ లో ఎక్కువ భాగం కెమెరా ఉందే ఉన్నాను. ఈ విషయం అందరికీ తెలుసు. ఇందులో దాచడానికి కూడా ఏమీ లేదు. ముఖ్యంగా అప్పుడు ఎలా ఉన్నానో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. మనిషి అన్నాక మార్పులు సహజం. ముఖ్యంగా ఆడవారిలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి మార్పులు వస్తాయి. అటు కోవిడ్ సమయంలో కూడా శారీరకంగా నేను దెబ్బ తిన్నాను. అప్పుడే వెయిట్ లాస్ కోసం ఎంతో కష్టపడ్డాను" అంటూ తెలిపి ఇంజక్షన్స్ తీసుకుంది అంటూ వస్తున్న వార్తలపై ఒక్కసారిగా క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఏది ఏమైనా తనపై వచ్చిన రూమర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చిందని చెప్పవచ్చు.
తమన్నా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఒకవైపు స్పెషల్ సాంగ్స్ చేస్తూనే.. మరొకవైపు ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న చిత్రాల విషయానికి వస్తే.. హిందీలో ఓ రోమియో, రేంజర్, రాగిణి ఎంఎంఎస్ 3, వివాన్ వంటి చిత్రాలతో పాటు విశాల్, సుందర్ సీ కాంబోలో వస్తున్న ఒక సినిమాలో నటించబోతోంది. మొత్తానికి అయితే తమన్నా వరుస చిత్రాలతో బిజీగా మారిపోయిందని చెప్పవచ్చు.