తమన్నా మరీ ఇంత బోల్డ్ 'గానా'.. లేటెస్ట్ పై కాంట్రవర్సీ
బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ ట్రెండ్ మారింది. ఒకప్పుడు హిందీలో స్పెషల్ అంటే సన్ని లియోన్ అనేవారు.;
బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ ట్రెండ్ మారింది. ఒకప్పుడు హిందీలో స్పెషల్ అంటే సన్ని లియోన్ అనేవారు. ఇప్పుడు మాత్రం సినిమాలో స్పెషల్ అంటే మిల్క్ బ్యూటీ తమన్నాను అప్రోచ్ అవుతున్నారు మేకర్స్. రెండేళ్లుగా బాలీవుడ్ ఒకటే కాదు సౌత్ లోనూ స్పెషల్ సాంగ్ అంటే మిల్క్ బ్యూటీకే ఓటేస్తున్నారు. తమన్నా ఆడిపాడిన పాటలకు సైతం ఆ రేంజ్ లోనే రెస్పాన్స్ వస్తోంది.
అయితే తాజాగా ఆమె బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ కోసం గఫూర్ అనే ప్రమోషనల్ సాంగ్ లో ఆడిపాడింది. ఈ పాటకు కూడా మంచి రీచ్ వస్తోంది. ఇందులో తమన్నా లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన లుక్స్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్ లోనూ ఉంది. అయితే స్పెషల్ సాంగ్ అంటేనే ట్రెండీ ఔట్ ఫిట్, హాట్ లుక్స్ అన్న విషయం తెలిసిందే.
కానీ ఈ పాటకు తమన్నా ఔట్ ఫిట్ ప్రస్తుతం కాంట్రవర్సీకి దారి తీస్తోంది. ఇందులో ఆమె డ్రెస్సింగ్ కాస్త హద్దు దాటినట్లు ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ఆమె నుంచి మరీ ఇలాంటి డ్రెస్సింగ్ సెన్స్ ఊహించలేదని, దీంతో సర్ ప్రైజ్ ఇచ్చారని, ఇది చూసి ఆశ్చర్యపోయినట్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి ఔట్ ఫిట్ ధరించేందుకు డేరింగ్ చేసినందుకు మెచ్చుకుంటున్నారు. జెన్ జీ (Gen Z) ట్రెండ్‌లను ప్రయత్నిస్తురని అంటున్నారు.
ఈ పాటలో ఆమె కాన్ఫిడెంట్, డ్యాన్స్ స్టెప్పులు అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే ఇది ఈ రోజుల్లో సినిమాల్లో బోల్డ్ ఫ్యాషన్ ఎలా కీలక పోషిస్తుందనే దాని గురించి చర్చలకు దారితీసింది. దీంతో ఇలాంటి బోల్డ్ పాట సినిమాలో అవసరం ఉండి ఆమె చేసిందా... లేదా ఇండస్ట్రీలో తన మనుగడ నిలదొక్కుకునేందుకు చేసిన ప్రయత్నమా అని ఆశ్చర్యపోతున్నారు.
అయితే ఆందరు క్రిటిసైజ్ చేయడం లేదు. కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు కూడా. ఆమె నేచురల్ బ్యూటీనెస్, డేరింగ్ నెస్ , కాన్ఫిడెన్స్, యూనిక్ స్టైల్ పట్ల తమన్నాను మెచ్చుకుంటున్నారు. హీరోయిన్లు తమ స్కిల్స్ చూపించేందుకు ఎంత దూరం వెళ్లగలరో ఈ పాట చూపించింది. ఈ సింపుల్ ప్రమోషనల్ సాంగ్ ప్రస్తుతం సినిమా ట్రెండ్స్ ను మార్చేసింది. దీంతోపాటు గతంలో తమన్నా జైలర్ లో కావాలయ్య , హిందీ సినిమా స్క్రీ 2లో ఆజ్ కి రాత్, అచావ్ అనే పాటల్లో ఆడిపాడింది. ఈ పాటల్లన్నీ యూట్యూబ్ లో సూపర్ హిట్ అయ్యాయి.