2026 లో త‌మ‌న్నా ఎనిమిది సినిమాల‌తో!

త‌మ‌న్నా వ‌య‌సింకా 35 ఏళ్లే. పెళ్లి చేసుకోలేదు. ఈ నేప‌థ్యంలో వృత్తి ప‌రంగా మ‌రికొంత కాలం బిజీగానే ఉంటుంది.;

Update: 2025-11-25 22:30 GMT

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా అందివ‌చ్చిన అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూ కెరీర్ ని ముందుకు సాగిస్తోంది. హీరోయిన్ ఛాన్స‌లులొస్తే? వాటిలో ఒదిగిపోతుంది...స్పెష‌ల్ సాంగ్స్ అంటూ ఎవ‌రొచ్చినా నో చెప్ప‌కుండా క‌మిట్ అవుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్ లో ఇంత బిజీగా ఉండ‌టం చిన్న విష‌యం కాదు. ఏన‌టైనా కొంత జ‌ర్నీ అనంత‌రం విరామంలోకి వెళ్లిపోతారు. కానీ త‌మ‌న్నా మాత్రం రెస్ట్ లెస్ గా ప‌ని చేస్తోంది. ఏ భాష‌లో అవ‌కాశం వ‌స్తే అక్క‌డ‌కెళ్లి ప‌ని చేస్తుంది. ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌, ప్రేక్ష‌కుల మెప్పు పొందుతుంది. ఈ ఏడాది `ఓదెల 2` లో లీడ్ రోల్ తో అల‌రించింది.

బాలీవుడ్ లో `రెయిడ్ 2` చిత్రం లో ఐటం పాట‌తో మెప్పించింది. `బాహుబ‌లి ది ఎపిక్` రిలీజ్ తోనూ మ‌రోసారి ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది. ఇలా మూడు విజ‌యాల‌తో అమ్మ‌డు 2025 ని ముగిస్తుంది. కానీ కొత్త ఏడాది 2026 లో మాత్రం త‌మ‌న్నా నామ సంవ‌త్స‌రంగానే హైలైట్ అవ్వ‌డానికి అవ‌కాశం ఉంది. అమ్మ‌డు కిట్టీలో ఇప్ప‌టికే ఎనిమిది సినిమాలు క‌నిపిస్తున్నాయి. జ‌న‌వ‌రిలో `ది రాజాసాబ్` రిలీజ్ అవుతుంది. ఇందులో త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్ తో అల‌రించ‌నుంది. తెలుగు సినిమాలో త‌మ‌న్నా ఐటం పాట ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు.

సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అవుతున్న చిత్ర‌మిది. అటుపై `మ‌న‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు` కూడా రిలీజ్ అవుతుంది. ఇందులో స్పెష‌ల్ సాంగ్ కాక పుట్టించ‌డం ఖాయం. చిరంజీవి సినిమాలో మ‌సాలా సాంగ్ కి ఉండే కిక్కే వేరు. అందులోనూ చిరుతో డాన్స్ షేర్ చేసుకోవ‌డం? అంటే ఇంకే రేంజ్ లో వైర‌ల్ అవుతుందో ఊహ‌కే అంద‌దు. అటుపై బాలీవుడ్ నుంచి ఏకంగా మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముంద‌కు రానుంది. `ఓ రోమియో` ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుంది. `రేంజ‌ర్` వ‌చ్చే ఏడాది ప్రారంభ‌మ‌వుతుంది. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న చిత్రం ఆన్ సెట్స్ లో ఉంది.

`వివాన్`, `రాగిణ ఎమ్ ఎమ్ ఎస్` అనే మ‌రో రెండు చిత్రాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. ఇవ‌న్నీ వ‌చ్చే ఏడాది రిలీజ్ అయ్యే సినిమాలే. అలాగే త‌మిళ్ లో సుంద‌ర్. సి ప్రాజెక్ట్ లో న‌టిస్తోంది. ఇది 2026లోనే రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ లైన్ లో ఉన్న చిత్రాలివి. ఇంకా త‌మ‌న్నా క‌మిట్ అయిన ప్రాజెక్ట్ లు కొన్ని ఉన్నాయి. వాటి వివ‌రాలు ఇంకా రివీల్ చేయ‌లేదు. త‌మ‌న్నా వ‌య‌సింకా 35 ఏళ్లే. పెళ్లి చేసుకోలేదు. ఈ నేప‌థ్యంలో వృత్తి ప‌రంగా మ‌రికొంత కాలం బిజీగానే ఉంటుంది.

Tags:    

Similar News