• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రొమాన్స్.. వయస్సుతో...

రొమాన్స్.. వయస్సుతో పనిలేదంటున్న సీనియర్ బ్యూటీ

| తెలుగు హీరోయిన్స్ కూడా మేమేమీ తక్కువ కాదంటూ అందాల ప్రదర్శనతో పాటు కిస్సింగ్ సన్నివేశాలతో నటిస్తూ ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-06-16 02:30 GMT

సినిమాలలో రొమాంటిక్ సన్నివేశాలు ఈ మధ్యాకాలంలో చాలా చిన్న విషయంగా మారిపోయాయి. హీరోయిన్స్ గా కూడా రొమాంటిక్, ఇంటిమేట్ సన్నివేశాలకి అడ్డు చెప్పడం లేదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలా అయిన నటిస్తామని అందాల భామలు చెబుతున్నారు. తెలుగు హీరోయిన్స్ కూడా మేమేమీ తక్కువ కాదంటూ అందాల ప్రదర్శనతో పాటు కిస్సింగ్ సన్నివేశాలతో నటిస్తూ ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తెలుగు సినిమాలలో ఇంకా శృంగార సన్నివేశాల విషయంలో కొందరు హీరోలు పరిమితులు పాటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు వాటిని ఎక్కువగా చూడటానికి ఇష్టపడరు అనే కామేంట్ కూడా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని స్టార్ హీరోలు ఎవరూ కూడా లిప్ లాక్ సన్నివేశాలు చేసే ప్రయత్నం చేయరు. యంగ్ హీరోలు మాత్రం సినిమాలో డిమాండ్ బట్టి కొన్ని సన్నివేశాలు చేస్తున్నారు. ఇక కొందరు హీరోయిన్స్ కి ఇలాంటి సన్నివేశాల విషయంలో పెద్దగా అభ్యంతరాలు లేవని చెప్పొచ్చు.

బాలీవుడ్ లో అయితే బోల్డ్ అంటే ఇంటిమేట్ సన్నివేశాలు సినిమాలలో సర్వసాధారణంగా ఉంటాయి. అక్కడి పబ్లిక్ కూడా వాటిని చూడటానికి ఇష్టపడుతున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మలు గ్లామర్ షో విషయంలో గాని ఇంటిమెంట్ సన్నివేశాలకి కానీ అస్సలు అభ్యంతరం చెప్పరు. సీనియర్ ముద్దుగుమ్మలు కూడా శృంగార సన్నివేశాలకి వయస్సు అడ్డంకి కాదని అంటూ బోల్డ్ సీన్స్ లలో నటిస్తూ ఉండటం విశేషం.

సీనియర్ స్టార్ హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో వెంకటేష్ కూలి సినిమాతో హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించిన టబు తరువాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. నటిగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. తెలుగులో టబు లిమిటెడ్ గానే సినిమాలు చేసింది. ఆమె చివరిగా అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ తల్లి పాత్రలో కనిపించింది. హిందీలో మాత్రం ఈ సీనియర్ బ్యూటీ ఫుల్ బిజీగా ఉంది. ఓ వైపు సినిమాలు, మరో వైపు వెబ్ సిరీస్ లు చేస్తోంది.

రీసెంట్ గా క్రూ అనే సినిమాలో ఎయిర్ హోస్టస్ గా టబు నటించింది. ఈ సినిమాలో ఆమె బోల్డ్ సన్నివేశాలలో నటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శృంగార సన్నివేశాలలో నటించడానికి తాను రెడీ అంటూ చెప్పుకొచ్చింది. శృంగారం అనేది యువకులకి, పరిమిత వయస్సు ఉన్నవారికి మాత్రమే కాదని తెలిపింది. అన్ని వయస్సుల వారు శృంగార సన్నివేశాలు చేయవచ్చని కామెంట్ చేసింది. తన నెక్స్ట్ సినిమా కూడా అలంటి శృంగారం, ప్రేమ బేస్డ్ కంటెంట్ తోనే ఉంటుందని చెప్పింది. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • FilmIndustry 
  • CoolieNo1 
  • Venkatesh 
  • Crew 
  • Tabu 
  • KareenaKapoor 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS