సూర్యకాంతం మరణిస్తే.. ఇండస్ట్రీ నుండి ఆ ఇద్దరే వచ్చారా?

తెలుగు తెర 'గుండమ్మ' సూర్యకాంతం గారు మరణించినప్పుడు.. ఆనాటి ప్రత్యేక పరిస్థితుల కారణంగా చిత్ర పరిశ్రమ నుండి ఎవరు పెద్ద సంఖ్యలో వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయారు.

Update: 2026-10-04 14:30 GMT

తెలుగు సినిమాలలో లెజెండ్రీ నటీమణిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సూర్యకాంతం గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. హాస్యం మేళవింపుతో కఠినమైన, అహంకారపూరితమైన, కుయుక్తి గల స్త్రీ పాత్రను పోషించడంలో ఈమె తర్వాతే ఎవరైనా.. చంద్రలేఖ అనే సినిమాతో డాన్సర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె.. ఆ తరువాత గయ్యాళి అత్త పాత్రతో ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. ముఖ్యంగా ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కలయికలో వచ్చిన క్లాసిక్ మూవీ గుండమ్మ కథ చిత్రంలో గుండమ్మ గయ్యాళి అత్త పాత్రలో ఈమె కనబరిచిన నటన శాశ్వతంగా ఆమెను అలాంటి పాత్రలకే పరిమితం చేసింది. తెలివిగల అత్తగా పేరును దక్కించుకున్న ఈమె.. తన అద్భుతమైన అసాధారణమైన నటనతో మహానటి సావిత్రి స్మారక అవార్డును కూడా అందుకుంది.

అలాంటి దిగ్గజ లెజెండ్రీ నటీమణి మరణిస్తే.. ఇండస్ట్రీ నుండి ఎవరూ స్పందించలేదని, అయితే అలాంటి సమయంలో ఫోన్ చేసి తమ కుటుంబానికి కొండంత ధైర్యం నింపిన సెలబ్రిటీలు ఇద్దరు మాత్రమే అంటూ ఆమె కుమారుడు పద్మనాభ మూర్తి పంచుకున్న హృదయ విధారక వాస్తవాలు అందరినీ కలిచి వేస్తున్నాయి. నిజానికి ఒక సెలబ్రిటీ మరణించారు అంటే.. చిన్న సెలబ్రిటీని మొదలుకొని పెద్దపెద్ద స్టార్ల వరకు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తారు. వారి భౌతిక కాయాలను దగ్గర నుండి సందర్శించి నివాళులర్పిస్తారు. కుటుంబాలకు కొండంతా అండగా నిలుస్తారు. అంతటి గొప్ప నటీమణి మరణిస్తే ఇండస్ట్రీ నుండి స్పందించకపోవడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి.

తెలుగు తెర 'గుండమ్మ' సూర్యకాంతం గారు మరణించినప్పుడు.. ఆనాటి ప్రత్యేక పరిస్థితుల కారణంగా చిత్ర పరిశ్రమ నుండి ఎవరు పెద్ద సంఖ్యలో వ్యక్తిగతంగా హాజరు కాలేకపోయారు. కానీ ఆ చేదు నిజాన్ని పక్కనపెట్టి టాలీవుడ్ దిగ్గజాలైన ఎన్టీఆర్ గారు నేరుగా ఫోన్ చేసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యి.. చాలా బాధతో మాట్లాడారట . మరొకవైపు ఏఎన్ఆర్ గారు సెట్స్ లో ఉన్నప్పుడు సూర్యకాంతం గారి క్రమశిక్షణను , ఆమెతో ఆయన పంచుకున్న ఘాడమైన బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె కుటుంబానికి అండగా నిలిచారు. పైగా తమ మద్దతును ప్రదర్శించారు.

వెండితెరపై ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య ఎంతటి ఆరోగ్యకరమైన పోటీ ఉన్నా.. తెరవెనుక తోటి నటీనటులను, వారి కుటుంబ సభ్యులను ఆదరించేవారు.. మాయాబజార్, గుండమ్మ కథ వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలలో కొత్తగా మెప్పించిన సూర్యకాంతం గారి పట్ల వారు చూపిన గౌరవం వెలకట్టలేనిది. ఒక దిగ్గజ నటి జీవిత చివరి క్షణాల్లో పరిశ్రమ ఏకం కాలేక పోయినప్పటికీ , ఎన్టీఆర్ కేవలం ఒక్క ఫోన్ కాల్ తో ఓదార్పు కన్నీళ్లు అందించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ల నివాళులు నేటి తరానికి ఆదర్శంగా నిలుపుతోంది ఈ ఘటన.

Tags:    

Similar News