సెటిలైపోయామనుకుంటే తొక్కుకుంటూ పోతారు!
సినిమా ఇండస్ట్రీ అంటే నాన్ గ్యారెంటీ జాబ్. ఏ శాఖలో చూసుకున్నా సెటిల్ అవ్వడం అంటూ ఉండదు.;
సినిమా ఇండస్ట్రీ అంటే నాన్ గ్యారెంటీ జాబ్. ఏ శాఖలో చూసుకున్నా సెటిల్ అవ్వడం అంటూ ఉండదు. ఎంత ట్యాలెంట్ ఉన్నా కొత్త వాళ్లు వస్తూనే ఉంటారు. సీనియర్లను మించిన టెక్నీషియన్లు, నటీనటులతో ఎప్పటికప్పుడు పరిశ్రమ అప్ డెట్ అవుతూనే ఉంటుంది. ఆ పోటీని తట్టుకుని ముందుకెళ్లడమే ఇక్కడ కీలకం. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ విరామం లేకుండా పనిచేస్తున్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఇందులో ఏ శాఖ మినహాయింపు కాదు.
ప్రత్యేకించి హీరోయిన్ల మధ్య పోటీ ఎలా ఉంటుంది? అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఎంత మంది హీరో యిన్లు ఉన్నా రోజూ హీరోయిన్లు దిగుమతి అవుతూనే ఉంటారు. తెలుగు నుంచి పెద్దగా కాంపిటీషన్ లేనప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి పోటీ అన్నది తీవ్రంగా ఉంటుంది. ఒక్క సక్సెస్ ఆ నటిని ఎలాంటి స్థానానికైనా తీసుకెళ్లి కూర్చో బెట్టగలదు. తాజాగా హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి ఇదే అంశంపై మాట్లాడింది. తన దృష్టిలో సినిమా అనేది ముగింపు లేని ప్రయాణం గా పేర్కొంది. స్థిరపడిపోయామని సంతృప్తి పడ్డామంటే? అక్కడితో కెరీర్ ముగిసినట్లే అవుతుందంది. కొత్త వారితో పోటీని ఎదుర్కుని ముందుకెళ్లాల్సిందే.
అలా చేయలేకపోతో కొత్త వారు మన స్థానంలోకి వచ్చి కూర్చుంటారంది. అందుకే మీనాక్షి ఎప్పుడు స్థిరపడ్డాని అనుకోనంది. చేతిలో నిత్యం పని ఉండాలంటే? విభిన్న పాత్రలు పోషిస్తూ నిర్విరామంగా పరిగెడుతూనే ఉండాలంది. ఇంత మంది ఉన్న పరిశ్రమలో మనకే అవకాశాలు రావాలంటే? వాళ్ల చిత్రాలకు మనం ఉండటం వల్ల ఏదో ఉపయోగం ఉంటుందని దర్శక, నిర్మాతలు భావించాలి. వారు బలంగా నమ్మేలా చేయాలంది.
అందు కోసం నటిగా వందశాతం కష్టపడినప్పుడే అది సాద్యమవుతుంది. టైంపాస్ గా సినిమాలు చేద్దామంటే కెరీర్ కూడా అలాగే ముందుకు సాగుతుందని అభిప్రాయపడింది. ఈ సంక్రాంతి కి అమ్మడు `అనగనగనా ఒక రాజు` అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నవీన్ పోలిశెట్టికి జంటగా నటించింది. ఈ సినిమాపై మీనాక్షి కూడా చాలా ఆశలే పెట్టుకుంది. గత ఏడాది 300 కోట్ల విజయవంతమైన చిత్రం చేతిలో ఉన్నా మరో పెద్ద ప్రాజెక్ట్ అందుకోలేకపోయింది.
ఈ నేపథ్యంలో నవీన్ సినిమాతో హిట్ అందుకుని నటిగా బిజీ అయ్యే ఆలోచనతో ముందుకు వెళ్లే ప్రణాళికతో కనిపిస్తోంది. కొత్త ఏడాది కొత్త ప్రేయత్నాలు పర భాషల్లో కూడా ప్రయత్నిస్తుంది. ఇప్పటి వరకూ టాలీవుడ్ పైనే దృష్టి పెట్టిన అమ్మడు సౌత్ లో ఇతర భాషలు సహా బాలీవుడ్ పైనా కాన్సంట్రేట్ చేస్తోంది.