ఛాన్స్ అడిగితే మాకేంట‌ని అడిగేవారు!

తాజాగా ఈ బ్యూటీ కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడింది. కాస్టింగ్ కౌచ్ కార‌ణంగా చాలా సినిమా అవ‌కాశాలు కోల్పో యానంది. అయినా ప‌రిశ్ర‌మ‌లో ధైర్యంగా నిల‌బ‌డి ముందుకు సాగుతున్నాని తెలిపింది.;

Update: 2025-07-24 12:15 GMT

బాలీవుడ్ న‌టి సుర్వీన్ చావ్లా గురించి ప‌రిచయం అస‌వ‌రం లేదు. ద‌శాబ్దం క్రిత‌మే కెరీర్ ప్రారంభించిన అమ్మ‌డు చాలా సినిమాలే చేసింది. క‌న్న‌డ‌, హిందీ, పంజాబీ చిత్రాలు ఎక్కువ‌గా చేసింది. తెలుగులోనూ `రాజు మ‌హ‌రాజు` అనే చిత్రంలో న‌టించింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ మ‌రో సినిమా చేయ‌లేదు. ఎక్కువ‌గా హిందీ ల్లోనే కొన‌సాగింది. అయితే ఎనిమిదేళ్ల‌గా బాలీవుడ్ లోనూ అవకాశాలు రాలేదు. దీంతో అమ్మ‌డు టెలివిజ‌న్ పై బిజీ అయింది. ప్ర‌స్తుతం బుల్లి తెర కంటెంట్ తోనే బిజీగా ఉంది.

తాజాగా ఈ బ్యూటీ కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడింది. కాస్టింగ్ కౌచ్ కార‌ణంగా చాలా సినిమా అవ‌కాశాలు కోల్పో యానంది. అయినా ప‌రిశ్ర‌మ‌లో ధైర్యంగా నిల‌బ‌డి ముందుకు సాగుతున్నాని తెలిపింది. `ఒక ద‌శ‌లో కాస్టింగ్ కౌచ్ పీక్స్ లో ఉండేది. అవ‌కాశం కోసం ఆఫీస్ కు వెళ్తే నీచంగా ..అస‌భ్యంగా మాట్లాడేవారు. అవ కాశం ఇస్తాను మ‌రి మాకేంటి? నీవ‌ల్ల మాకు ల‌బ్ది ఏంటి? అని సూటిగా అడిగేవారు. అలాంటి మాట‌లు చాలా ఆఫీస్ ల్లో విన్నాను. అవి విని విసిగిపోయాను.

ఇక్క‌డ ఇన్ని ర‌కాల ఇబ్బందులు పడుతూ సినిమాలు చేయాలా? అని ఎన్నోసార్లు బాధ‌ప‌డ్డాను. వాళ్లు అడిగిన దానికి అంగీక‌రించ‌క‌పోవ‌డం వ‌ల్లే చాలా అవ‌కాశాలు రాకూండా పోయాయి. కెరీర్ ఆరంభ రోజులు మాత్రం చాలా క‌ఠినంగా ఉండేవి. ఇవ‌న్నీ న‌టిగా సెట్ అయ్యే వ‌ర‌కూ ఉంటాయి. గుర్తింపు వ‌చ్చిందంటే? కొన్ని ర‌కాల స‌మ‌స్యల నుంచి బ‌య‌ట ప‌డొచ్చు. కానీ ఆరంభంలో మాత్రం మ‌హిళ సినిమా ఆఫీస్ కి వెళ్లిం దంటే? ఎన్నో ర‌కాల‌గా హింసించేవారు.

మీటూ ఉద్య‌మంలో భాగంగా అంత మంది మీడియా ముందుకొచ్చారంటే? వాళ్లెంత బాధ‌ప‌డి ఉంటారు. మ‌న‌సును చంపుకుని ఎవ‌రూ అలాంటి ప‌నులు చేయ‌లేరని ఆవేద‌న చెందింది. సుర్వీన్ చావ్లా బాలీవుడ్ లో అగ్లీ , హేట్ స్టోరీ-2 లో న‌టించింది. సీక్రెట్ గేమ్స్ , నారా నాయుడు, క్రిమిన‌ల్ జ‌స్టీస్: ఏ ఫ్యామిలీ మ్యాట‌ర్ లాంటి వెబ్ సిరీస్ ల్లో న‌టించింది. త్వ‌ర‌లో రిలీజ్ అవుతోన్న మండాలా మ‌ర్డ‌ర్స్ లోనూ న‌టించింది.

Tags:    

Similar News