ఆ స్టార్ హీరో కోసం విశ్వనాధ్ అండ్ సన్స్!
కోలీవుడ్ స్టార్ వరుస ప్లాప్ ల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన సూర్య సినిమా లేవి ఆశించిన ఫలితాలు సాధించలేదు.;
కోలీవుడ్ స్టార్ వరుస ప్లాప్ ల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో రిలీజ్ అయిన సూర్య సినిమా లేవి ఆశించిన ఫలితాలు సాధించలేదు. భారీ ప్రాజెక్ట్ ఒకటి బొల్తా కొట్టడంతో? సూర్య కంపర్ట్ జోన్ లోనే పని చేస్తున్నాడు. అవి కూడా అటు ఇటూ అవుతున్నాయి. దీంతో లాభం లేదనుకున్న సూర్య టాలీవుడ్ మేకర్ పై మనసు మళ్లించాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య 46వ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఇది ద్విభాషా చిత్రం. తెలుగుతో పాటు తమిళ్ లోనూ రూపొందిస్తున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీగా విని పిస్తుంది. ఈ జానర్ సూర్యకి కొత్తేం కాదు. కానీ ఇది వెంకీ మార్క్ ఎంటర్ టైనర్. మాఫియా కథ అయి నా? అన్ని వర్గాలు కనెక్ట్ చేయడం వెంకీ ప్రత్యేకత. యాక్షన్ తో పాటు ఫ్యామిలీ, యూత్ ని మెప్పించే అంశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. వెంకీ మార్క్ సెన్సిబిలిటీస్ కథలో హైలైట్ అవుతాయి.
ఆ పాయింట్ కే సూర్య లాక్ అయ్యాడన్నది యూనిట్ వర్గాల నుంచి తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్ తెరపైకి వచ్చింది. `విశ్వనాధ్ అండ్ సన్స్` టైటిల్ పరి శీలిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే? భారీ యాక్షన్ ఎంటర్ టైన్ అని మాత్రమే ఫోకస్ చేసే వర్గానికి ఇదో ట్విస్ట్. టైటిల్ త్రివిక్రమ్ స్టైల్లో కనిపిస్తుంది. వెంకీ కథలకు త్రివిక్రమ్ కూడా బాగా కనెక్ట్ అవుతారు.
ఈ సినిమా నిర్మాణంలో ఆయన సతీమణి సాయి సౌజన్య భాగస్వామి అన్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోన్న చిత్రమిది. కాబట్టి టైటిల్ నిర్ణయం వెనుక త్రివిక్రమ్ కీలక పాత్ర ధారే అవుతారు. గతంలోనూ ఇదే బ్యానర్ లో వెంకీ అట్లూరి సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ సిని మాలు మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలోనే ఆ కాంబినేషన్లో సినిమాలు సాధ్యమవుతున్నాయి.