సూర్య సినిమాకు అసలు పరీక్ష ఇదే!

ముఖ్యంగా సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్‌పై వస్తున్న వాయిదా వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.;

Update: 2026-05-11 08:06 GMT

2026 ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కు ఇండియన్ బాక్సాఫీస్‌లో ఇప్పటినుంచే హీట్ పెరుగుతోంది. తమిళ్, తెలుగు, హిందీ ఇండస్ట్రీలకు చెందిన భారీ సినిమాలు ఒకే సీజన్‌ను టార్గెట్ చేయడంతో రిలీజ్ డేట్ రాజకీయాలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్‌పై వస్తున్న వాయిదా వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. మొదట ఈ సినిమాను జూలైలో రిలీజ్ చేయాలని భావించిన మేకర్స్, ప్రస్తుతం ఆగస్టు వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే అదే సమయంలో రజనీకాంత్ జైలర్2, సన్నీ డియోల్ లాహోర్1947, నాని ది ప్యారడైజ్ లాంటి భారీ సినిమాలు కూడా రాబోతుండటంతో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది.

అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న మెయిన్ డిస్క‌ష‌న్స్ ఏంటంటే, పెద్ద స్టార్ హీరోలు, భారీ బ్యానర్లు నిజంగానే థియేటర్ స్లాట్స్‌ను కంట్రోల్ చేస్తున్నాయా అన్నది. రజనీకాంత్ సినిమా వస్తుందనే టాక్ బయటకు రావడంతోనే ఇతర నిర్మాతలు తమ రిలీజ్ డేట్స్‌పై మళ్లీ లెక్కలు వేసుకుంటున్నారనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా జైలర్ మొదటి భాగం ఇండిపెండెన్స్ డే సీజన్‌లో రిలీజై భారీ విజయాన్ని అందుకోవడం ఇప్పుడు జైలర్2కు అదనపు బలంగా మారింది. అలాంటి సమయంలో సూర్య న‌టించిన‌ విశ్వనాథ్ అండ్ సన్స్ లాంటి సాఫ్ట్ ఎమోషనల్ డ్రామా అదే క్లాష్‌లో నిలబడగలదా అనే సందేహాలు సహజంగానే వ్యక్తమవుతున్నాయి.

అయితే మరోవైపు కంటెంట్ బలంగా ఉంటే క్లాష్ భయం అవసరమా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. గతంలో చిన్న సినిమాలు కూడా భారీ క్లాష్‌ల మధ్య నిలబడి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. అందుకే కొందరు విశ్లేషకులు విశ్వనాథ్ అండ్ సన్స్ కు మంచి ఎమోషనల్ కనెక్ట్ ఉంటే రిలీజ్ టైమింగ్ కంటే కంటెంట్ ముఖ్యమవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరిపై ఇండస్ట్రీలో మంచి నమ్మకం ఉంది. ఈ సినిమాతో సూర్య‌కు మంచి హిట్ ను ఇస్తార‌ని అంద‌రూ బ‌లంగా న‌మ్ముతున్నారు. అయితే మ‌రోవైపు మాత్రం ఎంత కంటెంట్ స్ట్రాంగ్ గా ఉన్న‌ప్ప‌టికీ, ఎంత హిట్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ, పోటీలో వ‌స్తే క‌లెక్ష‌న్లు షేర‌వ‌డం ఖాయం. అలా కాకుండా సోలో రిలీజ్ చూసుకుంటే బిజినెస్ ప‌రంగా సినిమాకు ఉప‌యోగ‌ముంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇక సూర్య‌కు మాత్రం ఈ ఇయ‌ర్ చాలా కీలకంగా మారింది. సూర్య న‌టించిన వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలు తక్కువ గ్యాప్‌లో రిలీజ్ కాబోతుండటంతో ఈ రెండు రిజ‌ల్ట్స్ ఆయన పాన్ ఇండియా మార్కెట్ ఫ్యూచ‌ర్ ను డిసైడ్ చేసే అవకాశముంది. గత కొంతకాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సూర్య, ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్‌పై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే పోస్ట్‌పోన్ కల్చర్‌పై కూడా ఇండస్ట్రీలో విమర్శలు పెరుగుతున్నాయి. ఒకసారి అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్స్‌కు కట్టుబడి ఉండకపోవడం వల్ల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్ల ప్లానింగ్ నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ వరకు ప్రతిదీ రిలీజ్ క్యాలెండర్‌పై ఆధారపడుతుండటంతో లాస్ట్ మినిట్ ఛేంజెస్ మొత్తం చైన్‌పై ప్రభావం చూపుతున్నాయి. మ‌రి వీట‌న్నింటినీ దృష్టిలో పెట్టుకుని విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ రిలీజ్ డేట్ విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News